టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే ‘బింబిసార‘ మూవీతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. పటాస్ మూవీ వచ్చిన చాలా ఏళ్ళ తర్వాత కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే.. మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన బింబిసార.. వసూళ్లపరంగా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బెస్ట్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా 9 కోట్లకు పైగా లాభాలలో రన్ అవుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేయడంతో కళ్యాణ్ రామ్ టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో సినిమా టీంతో పాటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ శ్రీదేవితో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు కళ్యాణ్ రామ్. సీరియల్స్ నుండి సినిమాలలో అడుగుపెట్టిన శ్రీదేవి.. ఇప్పటివరకు చాలా సినిమాలే చేసింది. కానీ.. రీసెంట్ గా బింబిసార మూవీతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బింబిసారలో శ్రీదేవి.. శార్వరి అనే పాత్రలో నటించింది. సినిమాలో కీలకమైన ఆ పాత్ర.. బింబిసార లైఫ్ పై చాలా ప్రభావం చూపుతుంది. అయితే.. తాజాగా శ్రీదేవితో కళ్యాణ్ రామ్ చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తన కెరీర్, చిన్నప్పటి సినిమాల గురించి షేర్ చేసుకున్నాడు. అలాగే శ్రీదేవిని కూడా సినిమాలు, స్కూల్ లైఫ్, స్టడీస్ గురించి అడిగాడు. శ్రీదేవి స్కూల్ కి వెళ్లకపోయినా చాలా షార్ప్ అని.. స్టడీస్ లో వంద మార్కులు తెచ్చుకుంటానని చెప్పింది. దీంతో షాకైన కళ్యాణ్ రామ్ తన స్కూల్ లైఫ్ గురించి మాట్లాడాడు. “నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలగోపాలుడు అనే సినిమా చేశా. మా బాలయ్య బాబాయ్ నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు.
అలా సినిమాల్లోకి ఎంటరైన నేను ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని. నాకు కోక్ కావాలని, చాకోలెట్ ఇస్తేనే షూట్ లోకి వస్తానని చెప్పేవాడ్ని. సినిమా షూటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చాము. అంతే స్టడీస్ గాన్. మాకు 45 వస్తే పాస్.. 46, 47 ఇలా వచ్చేవి నాకు. అలా నా చదువు మొత్తం పోయింది” అని చెప్పుకొచ్చాడు. దీంతో కళ్యాణ్ రామ్ స్టడీస్ బాబాయ్ బాలయ్య వల్లే పోయిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కళ్యాణ్ రామ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.