జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ట్రిపులార్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులు నీరాజనాలు పట్టారు. ఇటీవల జపాన్‌లో సైతం ట్రిపులార్ సినిమాని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. అంతేకాకుండా.. జపాన్‌లో విడుదలైన ఇండియన్ సినిమాల కలెక్షన్స్ లో టాప్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా తారక్ న్యూ లుక్ ఒకటి ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. మళ్లీ బాద్షా రోజులు గుర్తొచ్చాయంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గత మూడేళ్లుగా తారక్ ఒకే లుక్‌లో కనిపించాడు. ట్రిపులార్ సినిమా స్టార్టింగ్ నుంచి జపాన్‌లో కూడా ట్రిపులార్ సినిమాని విడుదల చేసిన వరకు కూడా తారక్ అదే హెయిర్ స్టైల్లో ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఆ లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. హెయిర్‌ని ముందుకు దువ్వి బాద్షా గెటప్‌ని గుర్తు చేశాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలింహకిం తన ట్విట్టర్ ఖాతాలో తారక్ న్యూలుక్ వీడియో పోస్ట్ చేశాడు. అందరూ బాద్షా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోసారి బాద్షాని గుర్తుచేశావంటూ ఆలింహకింకి ధన్యవాదాలు చెబుతున్నారు.
Looking Extraordinary @tarak9999 sir 🔥🔥🔥 pic.twitter.com/XMOIMayAMq
— BANDLA GANESH. (@ganeshbandla) November 11, 2022
అయితే ఈ లుక్ దేనికోసమని సందేహం చాలా మందికి వచ్చింది. అయితే ఇది సరదాగా చేసుకున్న మేకోవర్ ఏమీ కాదులెండి. జూనియర్ ఎన్టీఆర్ ఓ యాడ్ షూట్ కోసం ఈ న్యూలుక్లోకి మారినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ని బండ్ల గణేశ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పక్కనే బాద్షా సినిమాలో తారక్ లుక్‌ని మరోసారి చూపిస్తూ ఆ పిక్‌ని కూడా షేర్ చేశాడు. ప్రొడ్యూసర్‌గా బండ్లన్న మరోసారి తన హీరోని నెట్టింట ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నట్లు అనిపించింది. ప్రస్తుతం తారక్ న్యూ లుక్ పాన్ ఇండియా లెవల్లో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ 30 సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.