ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే.. బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు. అవార్డులు, కలెక్షన్ల విషయంలో అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాలు సత్తా చాటినా సరే.. బాలీవుడ్ డామినేషనే ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత టాలీవుడ్ సినిమా రేంజ్ పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌గా మారింది. మన సినిమాలు అన్ని బాలీవుడ్‌లోకి వెళ్తూ.. అక్కడ భారీ విజయాలు సాధిస్తున్నాయి. మన హీరోలు, సాంకేతిక నిపుణులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.
ఇక తాజాగా విడుదలైన RRR ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా చూసి బాలీవుడ్ దిగ్గజ దర్శకులు, హీరోలు లోలోపల ఉడికి పోతున్నారు. కానీ ప్రేక్షకులు ఆదరించినప్పుడు వీరు చేసేది ఏం ఉండదు కనుక.. తమకు తోచిన విధంగా వారి అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఈ కోవలోకి ఓ స్టార్ హీరో చేరారు. తెలుగు సినిమాల్లో చేయను అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RRR మూవీపై రణ్ వీర్ సింగ్ ప్రశంసలుబాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఏప్రిల్ 1న ఎటాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ముంబై మీడియాతో మాట్లాడారు. ఓ పాత్రికేయుడు సార్ మీరు తెలుగులో సలార్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజమేనా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు లేదు అనే సమాధానం అయితే సరిపోతుంది. కానీ ‘‘నేను ఎలాంటి తెలుగు సినిమాలు చేయడం లేదు. ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు చేయను. నేను హిందీ హీరోని. ఇతర భాషల్లో సెకండ్ హీరోగానో, విలన్‌గానే నటించను. ఇతర హీరోల్లా నేను డబ్బు కోసం ప్రాంతీయ సినిమాలు చేయను’’ అన్నారు జాన్ అబ్రహాం.
ఇది కూడా చదవండి: RRR పై అసంతృప్తి.. జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్!
ప్రస్తుతం జాన్ అబ్రహాం వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. హిందీలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేదు. అసలు బాహుబలి, RRR రేంజ్ కలెక్షన్లు రాబట్టలేదు. ఇక్కడ సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేస్తున్నారు.. మరి ఏ విషయంలో టాలీవుడ్ ఈయన గారికి తక్కువగా కనిపించింది.. బాలీవుడ్‌లో మాత్రమే డబ్బులు ఇస్తారా.. టాలీవుడ్‌లో చేస్తే డబ్బులు ఇవ్వరా.. విలన్ క్యారెక్టర్లు అంటూ నోరు పారేసుకుంటున్నావ్.. వివేక్ ఒబెరాయ్‌కి ఇక్కడ ఎంత పవర్ ఫుల్ క్యారెక్టర్లు వచ్చాయో నీకు తెలుసా.. అయినా నిన్ను తీసుకుంటామని ఎవరు అడగలేదే.. నీకు అంత సీను కూడా లేదు అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. జాన్ అబ్రహమ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: RRR సినిమాపై MLA సీతక్క సంచలన వ్యాఖ్యలు!