జానీ మాస్టర్ కు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన స్టెప్పులతో జానీ మాస్టర్ ఇరగదీస్తారు. తాజాగా దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో రంజితమే సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. ఆ పాట యూట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. 150 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఇప్పటికీ దూసుకుపోతోంది. ఆ పాటలో విజయ్- రష్మిక మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. సినిమా మొత్తంలో ఆ పాట సూపర్ వైరల్ అయ్యింది. విజయ్- రష్మిక అభిమానులకు ఆ పాట అయితే తెగ నచ్చేసింది.
ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. ఈసారి అందులో విజయ్- రష్మిక లేరు. జానీ మాస్టర్ ఆయన క్రూ ఉన్నారు. తన అసిస్టెంట్స్, స్టూడెంట్స్ తో కలిసి జానీ మాస్టర్ రంజితమే సాంగ్ కు డాన్స్ ఇరగదీశారు. జానీ నాన్ స్టాప్ గా స్టెప్పులు వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్లంతా తమని తాము మర్చిపోయి కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇది ఎప్పటి వీడియో అన్నది తెలియకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ స్టెప్స్ ఎందుకు సాంగ్ లో పెట్టలేదంటూ విజయ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
Dancer @AlwaysJani 🔥🔥 #Ranjithame Song 🥁🥁🥁🥁 @MusicThaman 💥💥#BlockBusterVarisu ♥️♥️♥️ pic.twitter.com/UCmwTmWEL4
— Chandru (@ImChandruJcs) January 20, 2023
జానీ మాస్టర్ కెరీర్ విషయానికి వస్తే.. మొదట్లో చాలా అవమానాలు కూడా పడినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ, తన టాలెంట్ ని నమ్ముకుని డాన్సర్ జానీ.. జానీ మాస్టర్ గా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్, పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో జానీ మాస్టర్ పని చేశాడు. ఇటీవల విజయ్ బీస్ట్ సినిమాలో కూడా హలమితీ హబీబో సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ కూడా రికార్డులు సృష్టించింది.