విభిన్న కథలతో సంచలన విజయాలను అందుకోవడం హీరో సూర్యకి అలవాటు. ఈ నేపథ్యంలోనే సూర్య తాజాగా టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో “జై భీమ్” అనే సినిమాలో నటించాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
గిరిజన దంపతులైన రాజన్న-చిన్నతల్లి దంపతులు ఉన్నంతలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అయితే.. ఒక ధనవంతుని ఇంట్లో జరిగిన దొంగతనం నేరాన్ని రాజన్న మీద వేసి, అతన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఈ క్రమంలో ఆ దంపతులను చిత్ర హింసలకి గురి చేస్తారు. కానీ.., కొంతకాలం తర్వాత జైలులో రాజన్న ఐడెంటిటీ మిస్ అవుతుంది. అతను జైలునుంచి తప్పించుకున్నాడని పోలీసులు చెప్తారు. కానీ.. రాజన్న భార్య చిన్నతల్లి తన భర్త జాడ కోసం పోరాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే చిన్నతల్లి కష్టాన్ని చూసి నిజాయితీగల లాయర్ చంద్రు (సూర్య) ఈ కేసుని టేకప్ చేస్తాడు. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని అడ్డుకుని లాయర్ చందు ఈ కేసుని ఎలా చేధించాడు అన్నదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
కోర్టు డ్రామా ప్రేక్షకులకి కనెక్ట్ కావాలంటే కాన్ ఫ్లిక్ట్ పాయింట్ చాలా బలంగా ఉండాలి. నేల నుండి బాల్కానీ వరకు కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఆ కష్టాన్ని తనదిగా ఫీల్ అవ్వాలి. “జై భీమ్” లో ఈ కాన్ ఫ్లిక్ట్ పాయింట్ అదిరిపోయింది. మన వ్యవస్థలు నిరుపేదలను టార్గెట్ చేస్తాయన్న పాయింట్ కి 90 శాతం మంది ప్రజలు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ ఫీల్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. కథలో ఒక కష్టాన్ని బాగా ఎలివేట్ చేశాక, హీరో ఇంట్రడక్షన్ ఇస్తే.. అంతకు మించిన మాస్ ఎలివేషన్ ఇంకోటి ఉండదు. “జై భీమ్” లో సూర్య ఎంట్రీ కూడా ఇలానే జరిగింది. ఇక ఇక్కడ నుండి సూర్య లాయర్ చంద్రుగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. టెక్నీకల్ వర్క్ కూడా ఈ సినిమాకి బాగా కుదిరింది. దర్శకుడు తాను అనుకున్న కథని అనుకున్నట్టు చెప్పగలిగాడు.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
చివరి మాట: “జై భీమ్”.. సమాజానికి అవసరమైన సినిమా
Manikandan And That Female Lead Deserves National Award 😭💯❤️
Suriya Na Hands off🥺🕺💥
These FRAMES….Speaks The Whole Film….🤯😭💯
Really Fanboy Moment Naaa #Jaibhim
This Yr Best Film and Diwali Winner 💯🥺🔥@Suriya_offl Love U na ….Perumaiya iruku pic.twitter.com/gkezKX3b39
— i_a_m_h_a_r_i (@m_haraan2) November 2, 2021