ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసిన సెలబ్రిటీలు ఎవరైనా కొన్నాళ్ళకు దీనస్థితిలో కనిపిస్తే.. ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తారసపడుతున్నాయి. గతంలో స్టార్స్ గా వెలిగిన వారు.. అనారోగ్యం బారినపడి, కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఎదురు పడటం అనేది అందరినీ కలచివేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత వి. ఏ. దురైని చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
ఒకప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసిన సెలబ్రిటీలు ఎవరైనా కొన్నాళ్ళకు దీనస్థితిలో కనిపిస్తే.. ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తారసపడుతున్నాయి. గతంలో స్టార్స్ గా వెలిగిన వారు.. అనారోగ్యం బారినపడి, కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఎదురు పడటం అనేది అందరినీ కలచివేస్తోంది. ఇటీవల కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యం బారినపడి ఎలా అయ్యారో చూసి.. అందరూ షాకయ్యారు. వీల్ చైర్ లో చిక్కిపోయిన విజయకాంత్ ని చూసి ఫ్యాన్స్ తల్లడిల్లిపోయారు. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత వి. ఏ. దురైని చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
సూపర్ స్టార్ రజినీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన వి. ఏ. దురై.. కొన్నాళ్లుగా మధుమేహం వ్యాధి బారినపడి దీనస్థితిలో ఉన్నారు. వైద్యం కోసం కనీస ఖర్చులు లేకపోవడంతో.. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న.. స్టార్ హీరో సూర్య.. నిర్మాత దురైకి వైద్యం నిమిత్తం రూ. 2 లక్షలు సాయం అందించాడు. అలాగే మరింత అవసరమైనా తాను సాయం చేసేందుకు సిద్ధమేనని తెలిపాడు. దీంతో సూర్య బాటలో ఇప్పుడు కోలీవుడ్ సెలబ్రిటీలు దురైకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారు. నిర్మాతగా కెరీర్ లో శివపుత్రుడు(పితామగన్) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దురై.. ఎన్నమ్మా కన్ను, వివరమనా ఆలు, లూఠీ, గజేంద్ర సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ.. శివపుత్రుడుతో వచ్చిన క్రేజ్ ని ఆ తర్వాత ప్లాప్స్ కారణంగా నిలుపుకోలేక ఆర్థికంగా ఇబ్బందులలో పడిపోయారు దురై.
ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్న దురై.. సొంత ఇల్లు లేక, వైద్యానికి చిల్లిగవ్వ లేక అవస్థ పడుతున్నట్లు ఆయన స్నేహితుడు కుమార్.. ఫేస్ బుక్ లో వీడియో ద్వారా తెలియజేసారు. అయితే.. గతంలో బాలతో రెండో సినిమా చేసేందుకు రూ. 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడట. ఇన్నేళ్ళైనా ఆ డబ్బును బాల తిరిగి ఇవ్వకపోవడంతో.. ప్రెజెంట్ ఆయన చేతిలో ఏమి లేకుండా పోయిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితిలో హీరో సూర్యతో పాటు డైరెక్టర్ వెట్రిమారన్ ఆర్థికంగా సాయం చేశారని సమాచారం. దీంతో దురై పరిస్థితిపై ముందుగా స్పందించి సాయం అందించిన సూర్య మంచి మనసును అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. మరి సూర్య ఇలాంటి మంచి పనులు ఎన్నాళ్ళుగానో చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మరి సూర్య మంచి మనసు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
”மருத்துவ செலவுக்கு உதவுங்க ரஜினி சார்” வேண்டுகோள் விடுத்த பிதாமகன் தயாரிப்பாளர்..உதவிக்கரம் நீட்டிய சூர்யா https://t.co/wupaoCz9iu | #Suriya #Producer #VADurai #TamilCinema @Suriya_offl @rajinikanth pic.twitter.com/bS33mpsUlY
— ABP Nadu (@abpnadu) March 6, 2023
நீரிழிவு நோயால் பாதிக்கப்பட்டு சிகிச்சைக்கு பணமின்றி உதவி செய்யுமாறு, தயாரிப்பாளர் வி.ஏ.துரை வீடியோ வெளியிட்டு கோரிக்கை!#VAdurai #Producer #Pithamagan #TamilCinema #Galatta pic.twitter.com/39GSaeEtl4
— Galatta Media (@galattadotcom) March 6, 2023