సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా తక్కువ టైంలో మూడో సినిమాని అనౌన్స్ చేశారు. రోలెక్స్ 'సూర్య'కు హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు.
సూపర్ స్టార్ రజనీకాంత్.. కుర్రహీరోల కంటే యమ ఫాస్ట్ గా ఉన్నారు. లేకపోతే ఏంటి.. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికే కష్టపడుతుంటే.. రజనీ మాత్రం ఒకటి తర్వాత ఒకటి అంటూ ఏకంగా మూడు చిత్రాలని ఒకేసారి లైన్లో పెట్టారు. ఇవన్నీ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో రెండింటి గురించి జనాలకు తెలుసు. ఇప్పుడు మూడో ప్రాజెక్టు, తన 170వ సినిమాను తాజాగా అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీకి సూర్యతో హిట్ కొట్టిన డైరెక్టర్ వర్క్ చేయనున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రజనీకాంత్ కు సాలిడ్ హిట్ పడి చాలాకాలమే అయిపోయింది. అప్పుడెప్పుడో శివాజీ, రోబో, రోబో 2.. ఇవి తప్పితే ఆయన్నుంచి సరైన సినిమా రావట్లేదు. చేస్తున్న సినిమాలు కలెక్షన్స్ అయితే వసూలు చేస్తున్నాయి కానీ అవి రజనీ రేంజ్ కు సరిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడంటే చాలామంది హీరోలు పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. రజనీకాంత్ మాత్రం ఈ ఫేమ్ ఎప్పుడో చూసేశారు. దాన్ని కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ‘జైలర్’లో హీరోగా చేస్తున్న రజనీకాంత్.. తన కూతురు ఐశ్వర్య తీస్తున్న ‘లాల్ సలామ్’లో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ‘జై భీమ్’తో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన డైరక్టర్ జ్ఞానవేల్ తో కలిసి పనిచేసేందుకు తలైవా సిద్ధమైపోయారు. లైకా నిర్మాణ సంస్థ.. ఈ విషయాన్ని తాజాగా ట్వీట్ చేసింది. ‘తలైవర్ 170’ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇకపోతే ఈ మూవీకి అనిరుధ్ సంగీతమందిస్తుండగా.. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఇలా 72 ఏళ్ల వయసులోనే యమ ఫాస్ట్ గా రజనీకాంత్ మూవీస్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth 🌟 for #Thalaivar170 🤗
Directed by critically acclaimed @tjgnan 🎬 Music by the sensational “Rockstar” @anirudhofficial 🎸
🤝 @gkmtamilkumaran
🪙 @LycaProductions #Subaskaran#தலைவர்170 🤗 pic.twitter.com/DYg3aSeAi5— Lyca Productions (@LycaProductions) March 2, 2023
Official: #Thalaivar170 – TJ Gnanavel – Anirudh – Lyca🔥
Superstar #Rajinikanth expected to play cop role⭐⭐ pic.twitter.com/90zkFuaDGk— AmuthaBharathi (@CinemaWithAB) March 2, 2023