సాధారణంగా సినిమా తారలకు అభిమానులు ఉంటారు. ఫేవరెట్ హీరో, హీరోయిన్‌లకు సంబంధించిన ప్రతి అంశాన్ని తమదిగా భావిస్తారు. అయితే తాజాగా ఇందుకు రివర్స్ సీన్ చోటు చేసుకుంది. అభిమాని మృతి పట్ల సూర్య సంతాపం తెలిపాడు. ఆ వివరాలు..
సాధారణంగా సినిమా తారలకు అభిమానులు ఉంటారు. వారి పుట్టిన రోజు, సినిమాల విడుదల సమయంలో అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. అభిమాన తారల భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి.. వాటికి పాలాభిషేకాలు, హారతులు పట్టి.. దేవుడి పూజ చేస్తున్నట్లు చేస్తారు. అభిమాన తారలకు సంబంధించిన ప్రతి అంశాన్ని తమదిగానే భావిస్తారు. వారి సంతోషాన్న తమ సంతోషంగా, వారు బాధపడితే.. ఫ్యాన్స్ అంతకు మించి బాధపడతారు. ఎదుటి వ్యక్తి నుంచి ఏమాత్రం ఆశించకుండా.. కేవలం ప్రేమను మాత్రమే పంచేవారు అభిమానులు. సాధారణంగా తారల మీద ఫ్యాన్స్ ఎనలేని ప్రేమను కురిపిస్తారు. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అభిమాని మృతి పట్ల స్టార్ హీరో సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వివరాలు..
ఐశ్వర్య మృతి తీరని లోటని.. ఆమె ఎప్పటికి చిరంజీవి గానే ఉంటుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు హీరో సూర్య. ఇంతకు ఐశ్వర్య ఎవరు.. ఆమె మృతి పట్ల సూర్య ఇంతలా స్పందించడ ఎందుకు అంటే.. పది రోజుల క్రితం అమెరికా టెక్సాస్ మాల్‌లో జరిపిన కాల్పుల్లో.. హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య తాడికొండ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ క్రమంలో హీరో సూర్య ఐశ్వర్య మృతిపై ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆమె చిత్ర పటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించాడు సూర్య. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి తన సానుభూతి తెలుపుతూ.. లేఖ రాశాడు.
ఆ వివరాలు.. ‘‘మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మీ కుమార్తె ఐశ్వర్య కన్నుమూయడం దురదృష్టకరం. ఆమె ఎన్నటికి మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటుంది. ఒక ధ్రువతారలా వెలుగుతూనే ఉంటుంది’’ అంటూ ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చారు. అంతేకాక ‘‘ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు నిజమైన హీరోవి. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నువ్వొక ధ్రువతారవు. నీ చిరునవ్వు, నీ ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. మరి సూర్య చేసిన పనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Aishwarya ( an Ardent #Suriya fan) who was shot in the Allen Mall shooting in Texas..💔 Heartrending words from @Suriya_offl grieving the loss of his passionate fan and writing an emotional letter to the family. pic.twitter.com/6IsMNb6btM
— Laxmi Kanth (@iammoviebuff007) May 19, 2023