తెలుగు పాపులర్ బుల్లితెర ప్రోగ్రాంలలో జబర్దస్త్ కామెడీ ముందువరుసలో ఉంటుంది. సినీ కెరీర్ పరంగా అవకాశాలు లేక ఉండిపోయిన ఆర్టిస్టులు, కామెడీ పండించే టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు, అదే విధంగా లేడీ వేషాలలో అలరించే గెటప్ ఆర్టిస్టులకు అవకాశాలిచ్చి, వారికంటూ సపరేట్ క్రేజ్, గుర్తింపు తీసుకొచ్చింది జబర్దస్త్. జబర్దస్త్ షో ద్వారానే లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులు కాస్తోకూస్తో క్రేజ్ తో వెలుగులోకి వచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
జబర్దస్త్ వేదికగానే శాంతి స్వరూప్, తన్మయ్, హరికృష్ణ, పవన్ ఇలా పలువురు లేడీ గెటప్స్ వేసే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కోసారి బయటికి వెళ్తే వీళ్ళను నార్మల్ గెటప్స్ లో గుర్తించరు. వారి లేడీ గెటప్పులో కనిపించినప్పుడే బయట ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టి పలకరిస్తుంటారని చెబుతున్నారు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చంటి, చమ్మక్ చంద్ర లాంటివారు కూడా లేడీ గెటప్స్ లో అలరిస్తుంటారు. కొన్నేళ్లపాటు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ అన్నీ అద్భుతమైన కామెడీ పండించాయి.
లేడీ గెటప్స్ కి వేసేవాళ్ళకి స్కోప్ ఉన్నంతవరకూ శాంతి స్వరూప్, వినోద్, మోహన్ లాంటి ఎంతోమంది ఆర్టిస్టులు ఆర్థికంగా లాభం పొందారు. కానీ ఎప్పుడైతే కామెడీ షోలలో లేడీ గెటప్స్ వేసేందుకు నిజమైన లేడీస్ వచ్చారో.. అప్పటినుండి లేడీ గెటప్ ఆర్టిస్టులకు పని లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఏ కామెడీ షో చూసినా లేడీ గెటప్స్ అన్నీ ఆడవాళ్లే చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదివరకు గెటప్ ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించిన వారు కూడా ఇప్పుడు ఆడవాళ్ళనే తీసుకొచ్చేసరికి గెటప్ ఆర్టిస్టులు అవకాశాలు లేక ఆర్థికంగా వెనకబడుతున్నారని ఇప్పటికే ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో లేడీ గెటప్స్ వేస్తూ జీవనం సాగించే ఓ ఫ్యామిలీ హాజరైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జబర్దస్త్ లోకి ఆడవాళ్లు రాకముందు వారి ఆర్థిక పరిస్థితులు, అవకాశాలు బాగున్నాయని.. ఎప్పుడైతే ఆడవాళ్లు స్కిట్స్ లోకి వచ్చారో అప్పటినుండి మార్కెట్ లో లేడీ గెటప్స్ కి డిమాండ్ పడిపోయిందని తెలిపారు. బయటికి వెళ్తే మీరు టీవీలో కనిపించడం లేదుకదా.. ఇప్పుడు మీకెందుకు ఈవెంట్స్ ఇస్తామని అంటున్నారని.. మా ఫ్యామిలీలో అందరూ చులకనగా చూస్తారని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. లేడీ గెటప్స్ వేసేవారు లైఫ్ స్టైల్, వారి కష్టాలు.. ఫ్యామిలీల గురించి విని అందరూ ఎమోషనల్ అయిపోయారు.
ఈ నేపథ్యంలో లేడీ గెటప్స్ వేసేవారి లైఫ్ ఒరిజినల్ గా ఎలా ఉంటుందో చూపించారు. అదీగాక పెళ్లిళ్ల గురించి టాపిక్ వచ్చినప్పుడు సమాజంలో నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ ఇలా లేడీ గెటప్స్ వేసుకుంటున్నది కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమేనని.. ప్రొఫెషన్ లో భాగమని అర్థం చేసుకోవాలని చెప్పకనే చెప్పుకొచ్చింది ఆ లేడీ గెటప్ ఫ్యామిలీ. మరి లేడీ గెటప్స్ ని ఆడవాళ్లే వేస్తుండటం కారణంగా గెటప్పులు వేసే ఆర్టిస్టులకు పని లేకుండా పోయిందనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.