తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపువ్వా నవ్వించే కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్. ఏమిది సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో జబర్ధస్త్ కమెడియన్లు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో కొత్త షోలు పోటీగా వచ్చినా మద్యలోనే బ్రేక్ పడ్డాయి.. కానీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో టెలివిజన్ రంగంలో తన సత్తా చాటుతుంది జబర్ధస్త్. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన కమెడియన్స్ ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. షకలకశంకర్, సుడిగాలి సుధీర్ లాంటి వారు హీరోలుగా నటిస్తున్నారు.
జబర్ధస్త్ కామెడీ షో అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఆటో రాంప్రసాద్, ఆదీ టీమ్. ప్రతిసారీ ఏదో ఒక వెరైటీ స్కిట్స్ తో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఆటో రాంప్రసాద్ టీమ్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, సన్నీ. వీళ్ల కాంబినేషన్ లో వచ్చే స్కిట్స్ ప్రతిసారీ అలరిస్తూనే ఉంటాయి. ఈ ముగ్గురు మంచి మిత్రులు.. వీళ్ల కాంబినేషన్ లో ఆ మద్య త్రీ మంకీస్ మూవీ కూడా వచ్చింది. ఆ మద్య రాంప్రసాద్ ఫ్రెండ్స్ సుధీర్, గెటప్ శ్రీను ఇటీవల జబర్ధస్త్ నుంచి తప్పుకున్నప్పటికీ.. మళ్లీ గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక జబర్ధస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం పలు ఛానల్స్ లో హూస్ట్ గా ఉంటూ.. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘గాలోడు’ మూవీలో నటించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ లో గెటప్ శ్రీను ఒక్కడే కనిపించాడు. కాకపోతే ఈ మద్య గాలోడు మూవీ ఈవెంట్ లో సుధీర్ కి రాంప్రసాద్ ఫోన్ లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సుధీర్, గెటప్ శ్రీను, ఆంటో రాంప్రసాద్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో రాంప్రసాద్ కి తలకి ఒక కవర్ చుట్టుకొని ఉండటం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. దీంతో ఆటో రాంప్రసాద్ కి ఏమైంది? ఎందుకు రాలేదంటూ రక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే గాలోడు మూవీ ఈవెంట్ లో రాంప్రసాద్ గురించి ఓ వార్త చెప్పాడు గెటప్ శ్రీను. ఫంక్షన్ కి రాకపోవడానికి కారణం ప్రసాద్ తలకి సర్జరీ అయ్యిందని.. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటో రాంప్రసాద్ ఆపరేషన్ చేయించుకున్న మాట నిజమే… అది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ముగ్గురు మిత్రులు కలిసి ఉన్న ఫోటో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.