రామాయణం కథను బేస్ చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరణ అనేది ఉంటుంది. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ తో రామాయణం కథ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు నిర్మాత బాలీవుడ్ రామాయణం కథను నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడిగా యష్..
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని, డ్రీమ్ రోల్స్ అని ఉంటాయి. రాజమౌళికి మహాభారతం ఎలాగో.. నిర్మాత అల్లు అరవింద్ కి రామాయణం అలా. ఆయనకు రామాయణం అనేది డ్రీమ్ ప్రాజెక్ట్. రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. సీతారామ కళ్యాణం, లవకుశ, శ్రీరామరాజ్యం, రీసెంట్ గా ఆదిపురుష్ వరకూ చాలా చిత్రాలు వచ్చాయి. జనాలను బాగా అలరించాయి. రామాయణం అందరికీ తెలిసిన కథే అయినా దాన్ని తెరకెక్కించే విధానంలో ఎవరి స్టైల్ వాళ్లది. అయితే అల్లు అరవింద్.. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణం సినిమా నిర్మించాలని అనుకున్నారు. ఈ ప్రకటన వచ్చి దాదాపుగా మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందా? అనుమానాలు కూడా వస్తున్నాయి.
అయితే ఈ సినిమా ఆగిపోలేదని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే యోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ నితీష్ తివారి.. రామాయణం ప్రాజెక్టులో రాముడు, సీత లక్ష్మణుడు, హనుమంతుడు, రావణ పాత్రల కోసం కొందరిని లుక్ టెస్ట్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. రాముడుగా రన్బీర్ కపూర్, సీతగా అలియా భట్, రావణుడి పాత్రలో యష్ నటించనున్నారని, ప్రస్తుతం ఈ పాత్రలకు సంబంధించి వీరి మీద లుక్ టెస్ట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
ఇదే నిజమైతే సీత పాత్రలో అలియా భట్, రాముడి పాత్రలో రన్బీర్ కపూర్, రావణుడి పాత్రలో యష్ నటన ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యష్ రావణుడిగా చేస్తున్నాడని కన్ఫర్మ్ అయితే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో రావణుడి పోలికలు ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. ఈ జనరేషన్ లో రావణుడి పాత్రకు న్యాయం చేసే హీరో ఉంటే అది ఎన్టీఆర్ మాత్రమే. ఆ తర్వాత యష్ కూడా ఈ పాత్రకు సూట్ అవుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రావణుడి స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీఆర్ ఆ రేంజ్ లో ఇరగదీస్తే.. మరి యష్ రావణుడి పాత్రలో ఏ రేంజ్ లో ఇరగదీస్తాడో చూడాలి. అయితే ఆదిపురుష్ సినిమా అందరి అంచనాలను తారుమారు చేసింది. సైఫ్ అలీఖాన్ రావణుడిగా సెట్ అవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రామాయణం సినిమా వస్తుండడం సాహసమనే చెప్పాలి. మరి పాత్రల విషయంలో నటులు ఎంత వరకూ న్యాయం చేస్తారో చూడాలి.