టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ‘SSMB28’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. అయితే.. ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుందని ప్రకటించినప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు త్రివిక్రమ్ ఈసారి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు? యాక్షన్ లేదా కామెడీ? రెండు కలిపి అతడు లాంటి సినిమా చేయబోతున్నాడా? అంటూ ఫ్యాన్స్ లో వివిధ సందేహాలు నెలకొన్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే.. ఫ్యామిలీ, ఎమోషన్స్, ఓ పెద్ద ఇల్లు, హీరోయిజం, పంచులు ఇలా ఇంతకాలం చూస్తూ వచ్చారు. కానీ.. ఇప్పుడు మహేష్ సినిమా కోసం తన పంథా మార్చాడని టాక్. ఈ సినిమాలో మహేష్ నుండి పూర్తిస్థాయిలో యాక్షన్ ని బయట పెట్టాలని.. ఏకంగా కేజీఎఫ్ సినిమాలకు ఫైట్స్, యాక్షన్ డిజైన్ చేసిన అన్బు, అరివు మాస్టర్ లను బరిలోకి దింపుతున్నట్లు సమాచారం.
మరి నిజంగానే కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ ఆన్ బోర్డు అయ్యారో లేదో అధికారిక ప్రకటన రాలేదు. కానీ. దీనికి సంబంధించి వార్తలు మాత్రం సినీ వర్గాలలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా. త్రివిక్రమ్ ఈసారి మహేష్ కోసం పూర్తి యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. అదీగాక మహేష్ కూడా ఫుల్ లెన్త్ యాక్షన్ స్క్రిప్ట్ కావాలని అడిగాడని.. అందుకే స్క్రిప్ట్ డెవలప్ మెంట్ కి ఇంత సమయం పట్టిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ.. టీవీ ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరేట్స్ గా నిలిచాయి. ఇక ముచ్చటగా మూడోసారి అయినా బ్లాక్ బస్టర్ నమోదు చేస్తారేమో చూడాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. మరి SSMB28పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Trivikram Planning to rope Stunt Master of KGF,VIKRAM #Anbariv for #SSMB28 ACTION EPISODES🔥🔥🔥
Movie Full Action On Mode💥
— Tollywood Film News🔔 (@TollyFilmNews) August 16, 2022