కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ చేస్తుంటాయి. అలా వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే.. సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా కథాకథనాలు కాకుండా క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ తో హిట్టయ్యే సినిమాలు కూడా ఉంటాయి. ఆ కోవకే చెందుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’. గతేడాది చివరలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించి.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. అలాగే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చింది.
ఇక పుష్ప సక్సెస్ లో ప్రధాన కారణం.. అల్లు అర్జున్ క్యారెక్టర్, మేనరిజమ్, యాటిట్యూడ్. ముఖ్యంగా వైకల్యంగా ఉన్నవాడిగా బన్నీ అదరగొట్టాడు. అందులోనూ సినిమాలో దాదాపు అన్ని క్యారెక్టర్స్ ఒరిజినాలిటీకి దగ్గరగా డి-గ్లామరస్ గా ఉండటం విశేషం. అయితే.. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుందని విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఈసారి సీక్వెల్ ని చాలా గ్రాండ్ గా, వినూత్నమైన కథాకథనాలతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని.. అలాగే బన్నీ క్యారెక్టర్ తో సినిమాలోకి మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది.
ఈ క్రమంలో పుష్ప సినిమాలో కీలకపాత్ర కోసం లేడీ పవర్ స్టార్ సాయిపల్లవిని తీసుకురాబోతున్నాడట సుక్కు. ఇప్పటికే సాయిపల్లవిని పుష్ప టీమ్ కలిసి ఆమె క్యారెక్టర్ ని నేరేట్ చేశారని.. నేచురల్ క్యారెక్టర్ కావడంతో సాయిపల్లవి కూడా ఓకే చెప్పిందని టాక్. అయితే.. సాయిపల్లవికి ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసారని ఆరా తీయగా.. మన్యం బిడ్డగా చూపించబోతున్నారట. అడవిలో ఉండే అమ్మాయిగా అటు పుష్పకు సపోర్ట్ చేస్తుందో లేక వ్యతిరేకంగా ఉంటుందోనని సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అదీగాక విలన్ షెకావత్ సపోర్ట్ అయితే చూపించరు కదా.. అని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి పుష్ప-2 పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.
👉# pushpa2 planning to start the shoot in September
👉There are fresh rumors that #Pushpa2 cast will have a fresh addition
👉Rumors are that #SaiPallavi will be seen in a crucial role in the film as a Tribal girl
👉The role will only last for just 10 minutes, they say
— PaniPuri (@THEPANIPURI) August 31, 2022
❤️🙏🏻 pic.twitter.com/AoFU6ip8pa
— Sai Pallavi (@Sai_Pallavi92) May 9, 2022