హీరోయిన్ అనగానే.. గ్లామర్ షో చేస్తూ.. నాలుగు పాటల్లో కనిపిస్తే చాలనుకునే ఈ కమర్షియల్ రోజుల్లో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాయిపల్లవి. ఆమె రాకతో.. అప్పటివరకు ఉన్న ఈ భావాలు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించింది సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాదిన అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా మారుతున్న సాయిపల్లవిని టాలీవుడ్ స్టార్స్ కూడా తెగ పొగిడేస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా హై రేంజ్ లో ఉంటుంది. ఈ మధ్యనే ఓ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్.. సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: సాయిపల్లవిపై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు!
ఈ క్రమంలో సాయి పల్లవి గురించి.. ఇండస్ట్రీలో తాజాగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అందేంటంటే.. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సాయి పల్లవి డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తుం ఉంటారు. ఆమె ఓకే అంటే ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇంత క్రేజ్ ఉన్న ఈ న్యాచురల్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. సాయి పల్లవి తెలుగులో నటించిన చివరి సినిమా విరాటపర్వం ఒక్కటే. విడుదలకి సిద్ధంగా ఉన్నా ఈ సినిమా తర్వాత మరే సినిమాకి కమిట్ అవలేదు. దాంతో సాయిపల్లవి త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందని.. అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది.
ఇది కూడా చదవండి: ఇండస్ట్రీకి సాయిపల్లవి దూరంగా ఉంటుందా..?ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఆమె సన్నిహితులు మాత్రం పెళ్లి ప్రస్తావనను కొట్టి పారేస్తున్నారు. సినిమాల ఎంపిక, స్క్రిప్ట్ విషయంలో పల్లవి పక్కాగా ఉండే ఈ హీరోయిన్.. మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తోందని చెబుతున్నారు. పెళ్లి విషయంలో కూడా ఈ మధ్య మీడియా అడిగితే అప్పుడే నాకు పెళ్లేంటి.. ఇప్పుడు నా వయసు జస్ట్ 29 మాత్రమే అంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ కూడా గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు చాలా మంది ఇలాగే లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ సైలెంట్ గా పెళ్లి తంతు ముగించడంతో.. ఏమో అసలు నిజమేంటో అంటూ అనుమానిస్తున్నారు. మరి నిజంగానే సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కూలీగా మారిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!