ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ‘RC15’ ఒకటి. స్టార్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. పీరియాడిక్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాకు యువదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తుండటం విశేషం. అయితే.. వచ్చే ఏడాది విడుదల ప్లాన్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి రోజురోజుకూ సినీ వర్గాలలో కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు గురించి ఓ క్రేజీ న్యూస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు లీకైన పిక్స్ కూడా నిదర్శనంగా నిలిచాయి. ఈ క్రమంలో సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. పీరియాడిక్ పొలిటికల్ డ్రామా కాబట్టి.. ఈ సినిమాలో నేతాజీకి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉంటుందని అంటున్నారు. సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషర్స్ ని ఎదురించాడు. అయితే.. ఆ టైంలో బోస్ నుండి ఇన్స్పైర్ అయినవారిలో ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట.
అందుకోసమే సినిమాలో సుభాష్ చంద్రబోస్ ని కూడా చూపించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బోస్ సీక్వెన్స్ సినిమా సెకండాఫ్ లో వస్తుందని.. సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా బోస్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక ఈ సినిమాలో చరణ్ మాస్, క్లాస్ ఇలా చాలా రకాల వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. సో.. చరణ్ లుక్స్ తో పాటే సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్, సీక్వెన్స్ ఇన్స్పిరింగ్ గా ఉండబోతున్నాయని తమిళ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి అంచనాలు పెంచేసిన RC15 చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఫీస్ట్ ఇవ్వనుందేమో!
“I wrote the story and gave it to shankar sir
He and his team then developed the full screenplay
I’m really excited to see how the film is going to come out ”
~ @karthiksubbaraj about #RC15@shankarshanmugh @AlwaysRamCharan @advani_kiara @Mee_Sunil @MusicThaman #RamCharan pic.twitter.com/eM5Frs7USa
— Thyview (@Thyview) October 19, 2022
#RamCharan & #Shankar‘s #RC15 Satellite Rights acquired by #GeminiTV#KiaraAdvani #SJSuryah #NaveenChandra #Anjali #Sunil #Thaman pic.twitter.com/pzGOMzzqxW
— Telugu TV Updates (@telugutvupdts) October 24, 2022