హిట్.. ఈ సినిమాతో శైలేష్ కొలను పేరు టాలీవుడ్లో మారుమ్రోమగింది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే.. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.18 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా అటు విశ్వక్ సేన్ కెరీర్లోనూ గుర్తిండిపోయే చిత్రం. ఇప్పుడు మరోసారి హిట్ సినిమా పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇంకా కొన్నిరోజుల్లో హిట్ సెకండ్ కేస్ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈసారి సెంకడ్ కేస్‌లో హీరోగా విశ్వక్ సేన్ కాకుండా.. అడవి శేష్‌ని తీసుకున్నారు. ఎందుకు విశ్వక్‌ని పక్కన పెట్టారు అంటూ పెద్దఎత్తున ప్రశ్నలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందుకు డైరెక్టర్ స్వయంగా క్లారిటీ కూడా ఇవ్వడం చూశాం. హిట్ అనేది ఒక సినిమా కాదని.. అదొక యూనివర్స్ అని చెప్పుకొచ్చాడు.
అంటే శైలేష్ కొలను హిట్ యూనివర్స్ లో ఎంతోమంది పోలీసుల అధికారులు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక కథ(కేస్). కొన్నిసార్లు కేసుల విషయంలో హీరోలు కలుస్తూ ఉంటారని, కలిసి కేస్‌ని పరిష్కరిస్తాడని తెలిపాడు. అంటే రాబోయో చిత్రాల్లో తప్పకుండా విశ్వక్ సేన్ కనిపిస్తాడు అనమాట. మార్వెల్ యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోలకు ఎవరి కథ వారికి ఉంటుంది. మళ్లీ ఒక్కో కథలో అంతా కలిసి కనిపిస్తారు. శైలేష్ కూడా అదే ఫార్ములాను వాడుతున్నాడు. అలా ఇప్పుడు హిట్-2లో అడవి శేష్ కృష్ణ దేవ్(కేడీ)గా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా కృష్ణ దేవ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.
Natural X Intense
My big bro @NameisNani and I announce the #HIT2 Trailer#HIT2Trailer out on NOV 23rd ⏳
– https://t.co/klnQYQUrZ7#HIT2onDec2@KolanuSailesh @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @walpostercinema @saregamasouth pic.twitter.com/xHl2KAD7oy— Adivi Sesh (@AdiviSesh) November 21, 2022
అయితే హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో హిట్-3 గురించి ఓ హింట్ ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్-2 లాస్ట్ లో హిట్-3కి సంబంధించిన హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారని చెబుతున్నారు. హిట్-3 సినిమాకి సంబంధించి ఓ స్టోరీ లైన్ కూడా బయట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. హిట్-3లో విజయ్ సేతుపతి- నాని– అడవిశేష్ నటించనున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. అయితే నాని- విజయ్ సేతుపతి ఇద్దరిలో ఎవరైనా విలన్ పాత్ర చేయబోతున్నారా? అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ ముగ్గురు మాత్రం కలిసి నటిస్తారని చెబుతున్నారు. ఈ హిట్ సిరీస్‌కి నాచురల్ స్టార్ నాని కూడా ప్రొడ్యూసర్ అని అందరికీ తెలిసిందే. కాబట్టి నాని ఈ సినిమాలో నటిస్తాడు అంటే అనేది అంత నమ్మశక్యంకాని వార్తేమీ కాదనే చెప్పాలి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.