చలన చిత్ర పరిశ్రమలో నటీనటులు గాయాల పాలవుతున్నారు. మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు నటీనటులు గాయపడ్డారు. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదం బారిన పడ్డారు
చలన చిత్ర పరిశ్రమలో నటీనటులు గాయాల పాలవుతున్నారు. మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు నటీనటులు గాయపడ్డారు. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ యాక్టర్ వరుణ్ సందేశ్ గాయపడగా.. నటి రేణు దేశాయ్ కాలికి దెబ్బతగిలింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అమెరికాలో గాయపడిన సంగతి విదితమే. ఇప్పుడు మరో యువ నటుడు కాలికి గాయాలయ్యి కనిపించారు. అతడే ప్రముఖ టాలీవుడ్ నటుడు నవదీప్.
హీరో నవదీప్ కాలికి గాయమైంది. అయితే ఎలా జరిగిందో తెలియదు కానీ.. అతడిని చూసేందుకు వెళ్లిన నటి తేజశ్వి మదివాడ.. నవదీప్‌ను ఏడిపించింది. నీ సుఖమే నే కోరుతున్నా అంటూ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతడి కాలికి గాయమైనట్లు తెలిసింది. ‘నీ సుఖమే నే కోరుతున్నా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు’కాదంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందులో నవదీప్ ఎడమ కాలికి ఫ్యాక్చర్ కనిపిస్తుంది. తేజశ్వి ఆటపట్టిస్తుంటే మూలన కూర్చుని అలా చూస్తు ఉండిపోయాడు హీరో. ఇంతకు అతడికి ఏం జరిగిందో తెలియలేదు. అయితే ఈ వీడియో చూసి కొంత మంది ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. మరికొంత మంది త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.
నవదీప్ తేజ సినిమా జైతో హీరోగా పరిచమయ్యారు. చందమామతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే చేసిన సినిమాలు ఆశించినంత ఆడలేదు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ప్రతినాయక పాత్రల్లోనూ కనిపించాడు. తమిళ సినిమాల్లోనూ మెరిశాడు. బిగ్ బాస్‌లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓటీటీ సినిమాల్లో నటిస్తున్నాడు. నవదీప్, తేజశ్వి ఐస్ క్రీమ్ అనే సినిమా కలిసి చేశారు. అప్పటి నుండి వీరు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి విదితమే. గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలానే ఆటపట్టించాడు. ఇప్పుడు దానికే తేజూ రివేంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. నవదీప్ రీసెంట్‌గా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్‌తో, తేజస్విని ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ సిరీస్‌తో మన ముందుకు వచ్చారు.