చలన చిత్ర పరిశ్రమలో నటీనటులు గాయాల పాలవుతున్నారు. మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు నటీనటులు గాయపడ్డారు. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదం బారిన పడ్డారు
"తెలుగు ఇండియన్ ఐడల్2" షోకి నటసింహం బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక ఈ షోలో తనదైన శైలిలో నవ్వులు పూయించారు బాలయ్య. నవదీప్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు అంటూ స్టేజ్ పైనే పరువు తీశారు బాలయ్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారాన్ని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం హీరో నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. మనీ లాండిరింగ్, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుసుంది. అయితే ‘ఎఫ్ క్లబ్’పబ్ యజమాని నవదీప్ కావడం గమనార్హం. ఈ పబ్‌లో తరచూ సినీ ప్రముఖులు పార్టీలు నిర్వహించేవారని సమాచారం. ఈ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించేవారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. […]
టాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల నాటి కేసును సీరియస్ గా తీసుకొని కొత్తగా నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారో తెలుసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ […]