టాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల నాటి కేసును సీరియస్ గా తీసుకొని కొత్తగా నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారో తెలుసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పరిశీలించే అవకాశాలు వున్నాయంటూ ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత బాలీవుడ్ నటుల్ని ప్రశ్నించినప్పుడు బయటకు కొన్ని కీలక విషయాలు వచ్చాయి. టాలీవుడ్‌కు లింక్ వున్నట్లుగా తేలడంంతో ఈ వ్యవహారం మొత్తం ఆసక్తికరంగా మారింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు. నటుడు నవదీప్ నడుపుతున్న ఎఫ్ క్లబ్‌లో నిర్వహించిన పార్టీలో రకుల్‌ప్రీత్ సింగ్, రానా పాల్గొన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే నవదీప్ నడుపుతున్న ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా.. అప్పట్లో ఎఫ్ క్లబ్ నిర్వహించిన ఓ పార్టీలో రకూల్, రానా హాజరైనట్లు సీసీ టీవి ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.
మరోవైపు ఎఫ్ క్లబ్ పార్టీలో పలువురికి కెల్విన్ మాస్కరెన్హాస్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఈడీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చినట్టుగా సమాచారం. ఎఫ్ క్లబ్, డార్క్ వెబ్, కెల్విన్, నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ పేర్లు ఇప్పుడు కీలకంగా మారాయి. డ్రగ్స్ సరఫరా, ఆర్థిక లావా దేవాల గురించి కెల్విన్ ని ఈడీ విచారణ చేయగా కీలక కీలక అంశాలు వెల్లడించినట్లు సమాచారం. డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి, హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు పంపించినట్టు కెల్విన్ విచారణలో బయటపడింది. అయితే రకుల్‌ప్రీత్ సింగ్, నవదీప్, కెల్విన్ మధ్య వ్యవహరంపై ఈడీ ఆరా తీసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎఫ్ క్లబ్ మేనేజర్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఆ మద్య బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు రకుల్‌ప్రీత్ సింగ్ కాగా పలు ప్రశ్నలు ఈడి సంధించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎఫ్ క్లబ్ పార్టీ తెరపైకి రావడంతో ఇప్పుడు నవదీప్‌పై అందరి ఫోకస్ మళ్లింది. పార్టీకి హాజరైన యాక్టర్స్ నవదీప్ కంటే ముందుగానే ఈడీ ముందు హాజరవుతున్నారు. అయితే ఎఫ్ క్లబ్ ఓనర్ నవదీప్‌ని మాత్రం 9వ పర్సన్‌గా విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. దీంతో ఈ కేసులో ఇప్పుడు నవదీప్ కీలకంగా మారాడు. మొదట టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎక్సైజ్ శాఖ విచారించింది. ఈ సమయంలో దగ్గుబాటి రానా, రకుల్‌ప్రీత్ సింగ్ ల పేర్లు లేవు. అయితే ఈడీ అధికారులు మాత్రం ఈ ఇద్దరి పేర్లను చేర్చడంతో టాలీవుడ్ లో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈడి పలువురు సెలబ్రెటీల బ్యాంక్ అకౌంట్ల ట్రాన్జాక్షన్స్‌ని పరిశీలించే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కెల్విన్ అడ్డా ఎఫ్ క్లబ్బేనని భావిస్తున్నారు ఈడీ అధికారులు.