"తెలుగు ఇండియన్ ఐడల్2" షోకి నటసింహం బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక ఈ షోలో తనదైన శైలిలో నవ్వులు పూయించారు బాలయ్య. నవదీప్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు అంటూ స్టేజ్ పైనే పరువు తీశారు బాలయ్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ప్రసారం చేస్తున్న షో “తెలుగు ఇండియన్ ఐడల్2”. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆహా.. ఇప్పుడు ఈ పాటల ప్రోగ్రాం2 ని కొనసాగించే పనిలో ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ షోకి మొదటినుంచి భారీ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన ఆడిషన్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. జవాన్ చక్రపాణి, అమెరికాలో డాక్టర్ వృత్తి చేపడుతున్న శృతి నండూరిని తీసుకొని వచ్చి.. ఈ షోకి మంచి రేటింగ్ సంపాదించారు. ఇక తాజాగా ఈ షోకి నటసింహం బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వచ్చి సందడి చేసాడు. అంతే కాదు ఈ షోలో నవదీప్, బాలకృషల మధ్య జరిగిన సంభాషణలు చాలా ఫన్నీగా అనిపించాయి.
సినిమాలు, టాక్ షోలే కాదు మంచి ప్రోగ్రామ్ లు ప్రసారం చేస్తూ ఓటీటీ ఆహా దూసుకెళ్తుంది. బాల కృష్ణ ఆన్ స్టాపబుల్ షోతో మొదలైన ఈ దూకుడు ఎక్కడా తగ్గేలా కనిపించట్లేదు. ప్రస్తుతం “తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2” ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తిక్, గీతా మాధురి ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ షోకి సంబంధించి 4 నిమిషాల ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్యని స్పెషల్ గెస్టుగా ఆహ్వానించగా.. హీరో నవదీప్, బిందు మాధవి తమ కొత్త వెబ్ సిరీస్ “న్యూసెన్స్ “ప్రమోషన్ కోసం వచ్చారు.
అయితే ఎంతో సరదాగా సాగిన ఈ షోలో బాలయ్య, నవదీప్ ని ఉద్దేశిస్తూ..”ఆదివారం టీవీ ఆన్ చేస్తే.. శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నవదీప్.. కారు వదిలి పారిపోయిన నవదీప్ అంటూ ఒకటే రచ్చ” అంటూ బాలయ్య నవ్వుతూ.. నవదీప్ పరువు తీశారు. దాంతో అక్కడ అంతా నవ్వు తెప్పించాయి. ఇక చివరగా వీరి నటించిన వెబ్ సిరీస్ కి బాలయ్యతో పాటుగా అందరూ “ఆల్ ది బెస్ట్” తెలిపారు. బాలకృష్ణ తెలుగు ఇండియన్ ఐడల్ కి రావడం ఇదేమి కొత్త కాదు. ఇదివరకు సీజన్ 1 లో కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చి అందరిని అలరించాడు. ఇప్పుడు మరోసారి కూడా రావడంతో ప్రేక్షకులు కాస్త సర్ప్రైజ్ అయ్యారు. మరి బాలకృష్ణ ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి రావడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.