చిత్రపరిశ్రమలో సినిమాలను రీమేక్ చేయడమనేది ఎప్పటినుండో జరుగుతుంది. ఒక్కో భాషలో సూపర్ హిట్టయిన సినిమాలను వేరే వేరే భాషల్లో రీమేక్ చేస్తూ వస్తున్నారు. అలా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను తమిళంలో చాలామంది స్టార్స్ రీమేక్ చేశారు. ఇందులో దళపతి విజయ్ మినహాయింపు కాదు. ఇప్పటివరకు దాదాపు 9 తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నాడు. పెళ్లి సందడి, పవిత్ర బంధం మొదలుకొని.. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నీతో, బద్రి, అతనొక్కడే, ఒక్కడు, పోకిరి ఇలా తెలుగు సినిమాలు రీమేక్ చేసి తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు మొదటగా స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ‘ఒక్కడు’. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసి.. మహేష్ బాబు కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక, విలన్ గా ప్రకాష్ రాజ్ నటించి మెప్పించారు. అయితే.. ఒక్కడు సినిమాని విజయ్ హీరోగా తమిళంలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు ధరణి.. ఒక్కడు మూవీని ‘గిల్లీ’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించగా.. విలన్ గా అక్కడకూడా ప్రకాష్ రాజే నటించడం విశేషం. కాగా.. తాజాగా ఈ రెండు సినిమాలలో హీరో క్యారెక్టరైజేషన్, ఇంటెన్సిటీలకు సంబంధించి కొన్ని కథనాలు వైరల్ గా మారాయి.
దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఒక్కడు సినిమాతో మహేష్ బాబులోని ఇంటెన్సిటీ బయటపడిందనే చెప్పాలి. మహేష్ బాబులో హైలైట్ అయ్యే ప్రతి విషయాన్నీ గుణశేఖర్.. ఎలివేట్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. సినిమాని అంతే అందమైన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ చేశాడు మణిశర్మ. అయితే.. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఇంటెన్స్ తో స్టైలిష్ గా సిగరెట్స్ కాల్చడం మనం చూశాం. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, సాహసం సాంగ్ లో, ప్రకాష్ రాజ్ తో జీప్ లో వెళ్తున్నప్పుడు.. ఇంకా హరేరామ సాంగ్ టైంలో.. ఇలా ప్రతి సన్నివేశంలో మహేష్ బాబు స్మోకింగ్ షాట్స్ ని ఎంతో అందంగా కాప్చర్ చేశాడు గుణశేఖర్.
అదే తమిళ రీమేక్ గిల్లీ విషయానికి వచ్చేసరికి.. అంతా కొత్తగా సిగరెట్ కాల్చడం నేర్చుకునేవారు కాల్చినట్లుగా కామెడీ చేసేశారని అంటున్నారు. ఒక్కడు సినిమా అంతా హీరో మహేష్ బాబు ఎంతో ఇంటెన్స్ తో.. అటు సీన్స్ లో సీరియస్ నెస్, హీరోయిక్ మేనరిజం ఎంతో అందంగా చూపించారు. కానీ.. గిల్లీలో విజయ్ క్యారెక్టర్ లో ఇంటెన్స్, సీరియస్ నెస్ ఎక్కడా కనిపించవు. ఫలితం పరంగా రెండు పెద్ద హిట్టే. కానీ.. ఒక్కడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని విజయ్ అందుకోలేకపోయాడు. పైగా కొన్ని చోట్ల సీరియస్ సీన్స్ లో కూడా విజయ్ యాక్టింగ్ కామెడీగా అనిపిస్తుంది.
ఇప్పుడంటే విజయ్ స్టైల్, యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో.. కానీ, గిల్లీ సినిమా అంతా ఎక్కడా సీరియస్ నెస్ మెయింటైన్ చేయలేదని కామెంట్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. చార్మినార్ సెట్, కర్నూల్ కొండారెడ్డి బురుజు, పాతబస్తీ యాక్షన్ సీక్వెన్స్.. కబడ్డీ గేమ్.. క్లైమాక్స్ లో విలన్ తో ఫైట్.. ఇలా సినిమా అంతా మహేష్ క్యారెక్టర్ ఇంటెన్సిటీ క్యారీ చేస్తూనే సాగుతుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, యాక్షన్ సీక్వెన్సులు ఎక్కడా ఆర్టిఫిషియల్ గా అనిపించవు. కానీ.. విజయ్ కోసం గిల్లీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి.. రీమేక్ సినిమాలో ఇంటెన్స్ మిస్ చేసి.. పులిహోర చేసేశారు. సబ్జెక్టులో దమ్ముంది కాబట్టి.. విజయ్ ఈజీగా సేవ్ అవ్వగలిగాడని టాక్.
ప్రస్తుతం ఒక్కడులో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్.. రీమేక్ గిల్లీలో విజయ్ క్యారెక్టరైజేషన్స్ కి సంబంధించి వీడియోలు పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమాని విజయ్ కామెడీ యాక్టింగ్ తో చెడగొట్టేశాడని, దాన్ని తమిళ ఆడియెన్స్ ఎలా అంగీకరించారో అర్థం కావట్లేదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే సినిమాలో మహేష్ బాబు సిగరెట్ తాగే సీన్స్ తో.. విజయ్ సీన్స్ పోల్చి సోషల్ మీడియాలో కడిగేస్తుండటం గమనార్హం. మరి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఒక్కడు టాపిక్ తెరపైకి వచ్చిందని అంటే.. ఇటీవల మహేష్ బాబు ఫ్యాన్స్.. ఒక్కడు, పోకిరి సినిమాలు రీరిలీజ్ చేసుకొని సెలబ్రేషన్స్ జరిపిన విషయం విదితమే. ఈ క్రమంలోనే గిల్లీలో విజయ్ సీన్స్ పై ట్రోల్స్ మొదలైనట్లు సమాచారం.