RRR: ఇండియన్ సినీచరిత్రలో ఈ ఏడాది 1000కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన మొదటి సినిమాగా RRR రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించాడు. అయితే.. RRR విడుదలై మూడు నెలలు అవుతున్నా.. ఇంకా సినిమా క్రేజ్ మాత్రం దేశవిదేశాలకు వ్యాపిస్తోంది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ట్రిపుల్ ఆర్ సినిమా.. చాలామంది హాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా చూసిన హాలీవుడ్ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మార్వెల్ చిత్రకారుడు అలిస్ ఎక్స్ జాంగ్, టీవీ మరియు సినీ రచయిత అమీ పాలెట్ హార్ట్‌మన్.. ఇలా చాలామంది హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ గురించి స్పందించారు. అయితే.. వీరిలో కొందరు సినిమాను థియేటర్ లో చూడగా.. మరికొందరు నెట్ ప్లిక్ లో చూసి తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
ఇక తాజాగా RRR గురించి హాలీవుడ్ 21 జంప్ స్ట్రీట్, ది లెగో, స్పైడర్ మ్యాన్ (ఇంటూ స్పైడర్ వర్స్) చిత్రాల దర్శకుడు, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్ ట్వీట్ చేశారు. “RRR ఒక అద్భతం. ఇది మైఖేల్ బే, బాజ్ లుహ్రమాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి సినిమా తీయడం లాంటిది. ఇది 3 గంటల నిడివి ఉంది. కానీ.. 4 గంటలు ఉన్నా చూడొచ్చు. ఈ సినిమా చూస్తూ నేను ఎంతో ఎంజాయ్ చేశాను” అని RRRపై ప్రశంసలు కురిపించారు. క్రిస్టోఫర్ ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేస్తూ చిత్రనిర్మాణ సంస్థ ట్విట్టర్ లో రీట్వీట్ చేసింది. మరి RRR మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The Director of 21 Jump Street, The LEGO Movie, Spiderman: Into the Spider-verse about #RRRMovie!! https://t.co/XJlLIHsnEQ
— DVV Entertainment (@DVVMovies) June 15, 2022