తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన హిమజ.. సీరియల్స్ ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత అడపాదడపా సినిమా ఛాన్సులు అందుకొని మంచి గుర్తింపు దక్కిచుకుంది. ప్రస్తుతం అటు సినిమాలలో, అప్పుడప్పుడు టీవీ షోలలో యాంకరింగ్ తోనూ తన సత్తా చాటుతోంది. అయితే.. కెరీర్ ని బ్యాలన్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది హిమజ.
ఇది చదవండి: తన పెళ్లి, విడాకులపై స్పందించిన నటి హిమజ!
ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఈ షో ద్వారా కాంట్రవర్సీలు ఫేస్ చేసింది కానీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హిమజకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. దాదాపు 1.5 మిలియన్ ఫాలోయర్స్ కలిగిన హిమజ.. ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడుతుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.అలాగే దళపతి విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ మూవీలోని అరబిక్ కుత్తు సాంగ్ రీల్స్ లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ క్రమంలో ట్రెండ్ ని ఫాలో అవుతూ.. హిమజ కూడా ఓ రీల్ చేసింది. అయితే.. అందరూ చేసినట్లుగా డాన్స్ చేయకుండా ఈ బ్యూటీ చెట్టు కల్లు తాగుతున్న వీడియో పోస్ట్ చేసింది. కల్లు తాగుతున్న హిమజ వీడియో చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నెట్టింట హిమజ వీడియో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.