టబు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. గతంలో అనేక హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇక నటనతోనే కాకుండా తన అంద, చందాలతో సైతం కుర్రాకారును తన వైపుకు తిప్పుకుని అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న భోలా సినిమాల్లో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ లో భాగంగా టబు నడుపుతున్న ట్రక్కును వెనకాల నుంచి మరో ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టబుకు కుడి కన్నుకి తీవ్రగాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే గమనించిన యూనిట్ సభ్యులు సెట్ లో ఉన్న డాక్టర్ తో వైద్యం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖంగారుపడాల్సిన అవసరం ఏం లేదని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. టబు తెలుగులో చెన్నకేశరెడ్డి, ప్రేమదేశం, అందరివాడు, పాండురంగడు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక చిన్న గాయాలతో బయటపడ్డ టబు ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Tabu gets injured on the sets of ‘Bholaa’ in Hyderabad
On Wednesday morning, Tabu, who is playing a fearless, high-ranking police officer in Ajay Devgn’s actioner titled ‘Bholaa’, escaped a major injury while performing a dare-devil stunt. pic.twitter.com/RVUTiRkuIn— SabrangRadio Rajesh (@sabrangradio) August 10, 2022