ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల కావాలంటే ఎన్నో కష్టాలను దాటాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాలు ఆ మూవీని చూట్టుముడుతూ ఉంటాయి. దీంతో ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అదీ కాక కొన్నిసినిమాలు ఆర్థిక నష్టాలను భరించలేక షూటింగ్ సగంలోనే ఆపేసిన సందర్భాలు లేకపోలేదు. ఈక్రమంలో సినిమా మధ్యలో ఆగిపోవడంతో హీరో బెదించాడని ఓ ప్రొడ్యూసర్ కేసు పెట్టడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కొంత మంది హీరోలు సినిమాలో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు దూకుడుగా, ర్యాష్ గా ఉంటారు. ఈ క్రమంలో వారు కొన్ని సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు కన్నడ సుపర్ స్టార్ హీరో దర్శన్. ఓ ప్రొడ్యూసర్ ని బెదించిన కేసులో ఇతనిపై బెంగళూరులోని కెంగేరి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రెండు సంవత్సరాల క్రితం ''శ్రీ కృష్ణ పరమాత్మ'' సినిమా లో తన బంధువైన ధృవన్ తో కలిసి నటించేందుకు దర్శన్ ఒప్పుకున్నాడు. ఆ చిత్రానికి నిర్మాతగా భరత్ విష్ణుకాంత్ వ్యవహరించాడు. అయితే అనుకోని ఆర్థిక కారణాలతో ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఇదే విషయమై హీరో దర్శన్ ధృవన్ మధ్య వర్తిత్వంలో నిర్మాత భరత్ తో ఫొన్లో మాట్లాడాడు. ఇప్పుడు అదే ఫొన్ కాల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో దర్శన్ నిర్మాత అంతు చూస్తానంటూ.. అలాగే ఎక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని అన్నట్లు భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై అదనపు కమిషనర్ సందీప్ పాటిల్ స్పందిస్తూ.. 'దీనిపై నాన్ కాగ్నిటివ్ (NCR)కేసు నమోదు చేశామని, అలాగే దర్యాప్తులో ఆ ఆడియో టేప్ సంవత్సరం నాటిదని తేలిందని తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని' ఆయన తెలిపారు. ఈ విషయంపై దర్శన్ ను వివరణ కోరగా ఆయన స్పందిస్తూ..'' అది నా వాయిస్ కాదు. ఎవరో మిమిక్రి చేశారు. దానిని నేను హీరోగా నటించిన 'క్రాంతి' సినిమా షూటింగ్ లో నేను మూవీ హక్కుల గురించి మాట్లాడిన మాటలు అవి. వాటిని మార్చి ఇలా నాపై తప్పుడు కేసు పెట్టారు. నేను ఆ రికార్డుని కేసులో అందజేస్తానని' దర్శన్ తెలిపాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఆడియో కాల్ నెట్టింట వైరల్ గా మారింది. మరి హీరో, నిర్మాతల గొడవ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Sita Ramam Collections: ‘సీతారామం’ 5వ రోజు కలెక్షన్స్.. ‘తగ్గేదే లే’.. ఇదీ చదవండి: నేను ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి: ఆమిర్ ఖాన్