నందితా శ్వేత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా నుంచి 2021లో వచ్చిన అక్షర సినిమా వరకు తన నటనతో ఆకట్టుకుంది. తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నందితా శ్వేతకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నందితా శ్వేత యాక్టర్ మాత్రమే కాదు.. మోడలు, మంచి డాన్సర్ కూడా. ఆమె ప్రస్తుతం ఢీ డాన్సింగ్ ఐకాన్ ప్రోగ్రామ్ లో న్యాయ నిర్ణేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ షో నుంచి విడుదలైన ఓ స్పెషల్ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: లైవ్ లోనే గొడవపడ్డ తమన్- నిత్యామీనన్! వీడియో వైరల్!
ఢీ నిర్వాహకులు సెట్ నందితా శ్వేత పుట్టిన రోజు చాలా గ్రాండ్ గా చేశారు. బర్త్ డే రోజు నందితా ఫ్రీగా ఉండదు కాబట్టి ఆమెతో ముందే కేక్ కట్ చేయించి విషెస్ చెప్పారు. ఆ సందర్భంగా నందితా శ్వేతకు ఫుల్ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు. నందితాకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత నందితాకు ఎంతో ఇష్టమైన సింగర్ చిత్ర వీడియో ద్వారా బెస్ట్ విషెస్ చెప్పారు. అయితే ఆమెకు అన్నింటికి మించిన ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే.. నందితాకు ఖుషీ అని ఒక కుక్క ఉండేది. అది రీసెంట్ గా చనిపోయింది. నందితా శ్వేతకు అచ్చు అలాంటి ఓ కుక్కను ఢీషోలో గిఫ్ట్ చేశారు. అది చూసి నందిత ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. నందితాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.