ఈ మద్య కాలంలో పలు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల సినీ తారలు దూరం కావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నారు. స్టార్ నటీనటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సెవ్వజై రాసు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సెవ్వజై రాసు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను మధురైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. 2007 లో ప్రముఖ నటుడు కార్తీ మొదటి చిత్రం ‘పరుత్తివీరన్’ మూవీలో పొనంతిన్ని పాత్రలో సెవ్వజై రాసు కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ ప్రియమణికి ఉత్తమ జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. సెవ్వజై రాసు ఎన్నో కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించారు. రాసు వాయిస్ అంటే తమిళ అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.. ఆయన వాయిస్ ని చాలా మంది అనుకరించారు.
తమిళనాడు తేనీలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన సెవ్వజై రాసు ఎంజీఆర్ ప్రభుత్వంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా పనిచేశారు.. ఆ తర్వాత ఎంజీఆర, జయలలితకు బాడీ గార్డ్ గా పనిచేవారు. భారతీ రాజాకి ఆయన దూరపు బంధువు కావడంతో ‘కిజక్కు సీమాయిలే’ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు సెవ్వజై రాసు. ఆ తర్వాత ‘మైనా’, ‘కందసామి’సహా దాదాపు 20 చిత్రాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. ఆయన మృతికి ప్రముఖ సినీ తారలు నివాళులర్పించారు.