నెల్లూరు జిల్లాలోని ఓ హోటల్‌లో చైతన్య దిగారు. ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు ప్రణాళిక వేసుకున్నారు. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఢీ డ్యాన్స్ షో ఫేమ్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య కేసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చైతన్య ఆత్మహత్యకు బెదిరింపులు కారణమన్న ప్రచారం జరుగుతోంది. అప్పులు ఇచ్చిన వారి బెదిరింపులతోటే చైతన్య ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉంటాడన్న టాక్ వినిపిస్తోంది. పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. చైతన్య ఫోన్‌ను ఇప్పటికే స్వాధీనంలోకి తీసుకున్నారు. అతడి కాల్ డేటాను వారు పరీక్షించే అవకాశం ఉంది. ఇక, చైతన్య మరణంపై ఆయన మిత్రుడు ఒకరు మాట్లాడుతూ..చైతన్య మాస్టర్ లైఫ్ గురించి చాలా చెప్పేవాడని అన్నారు.
తోటి డ్యాన్సర్‌లను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండేవారని తెలిపారు. చైతన్య మరణానికి ఆర్థిక సమస్యలు కారణం కాదని స్పష్టం చేశారు. ఈ మాటలతో బెదిరింపుల ప్రచారానికి బలం చేకూరుతోంది. కాగా, చైతన్య మాస్టర్ శనివారం నెల్లూరు జిల్లాలో తనకోసం ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరయ్యారు. సన్మానం అనంతరం బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీశారు. తాను చనిపోవటానికి అప్పులే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇక, చైతన్య మాస్టర్ చెల్లెలి పెళ్లి కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. కుటుంబం కోసం కూడా కొన్ని అప్పులు చేశారు. అంతేకాదు! తన కెరీర్ కోసం.. డ్యాన్స్ స్టూడియో ఏర్పాటు కోసం కూడా అప్పు చేశారు.
వచ్చే సంపాదన అప్పులు తీర్చడానికి సరిపోయేది కాదు. దీంతో ఆ అప్పులు తీర్చడానికి మరో చోట అప్పులు చేశారు. ఇలా అప్పుల మీద అప్పులు చేయటం.. వాటి వడ్డీలు పెరిగి పోవటం మొదలైంది. చాలీ చాలని సంపాదనతో ఆ అప్పుల్ని తీర్చటం ఆయన వల్ల కాలేదు. అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి మొదలైంది. ఈ ఒత్తిడి తాళలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మరి, చైతన్య మాస్టర్ మరణానికి బెదిరింపులు కారణం అయి ఉంటాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.