ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.మొదటి చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఈ బ్యూటీఫుల్ బేబీకి అబ్బాయిలు ఓ రేంజ్లో ఫిదా అయ్యారంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. టాలీవుడ్లో బిగ్ డిమాండ్ ఉన్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది కృతి. తాజాగా మరోబిగ్ ఛాన్స్ కూడా పట్టేసిందన్న వార్తలు విన్పిస్తున్నాయి.
తాజాగా కృతి శెట్టికి ఓ హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి వచ్చిన ఆ క్రేజీ ఆఫర్ గురించి ఇంకా పూర్తి వివరాలను బయటపెట్టడం లేదు. కానీ ఓ బడా ప్రొడక్షన్ కంపెనీ ఈ ముద్దుగుమ్మన చాన్స్ ఇచ్చినట్టుగా మాత్రం ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్లో ఓ యంగ్ హీరో ఈ మూవీ చేయబోతున్నాడట. చాలా రోజులుగా ప్రెష్ ఫేస్ కోసం ఎదురుచూస్తున్నవారికి కృతి బాగా నచ్చేసిందట. ఆల్ రెడీ ఓ రౌండ్ సంప్రదింపులు కూడా జరిగాయని.. అయితే రెమ్యునరేషన్ విషయంలో మరోసారి సిట్టింగ్ ఉందని తెలుస్తోంది.
మొదటి నుంచి కృతి శెట్టి చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ టైంలో గనుక బీటౌన్ ఆఫర్ను ఒప్పుకుంటే.. అమ్మడి డిమాండ్ మరింత పెరగడం ఖాయమని అంతా అంటున్నారు. అయితే అమ్మడు దాదాపుగా ఈ సినిమాకు ఓకే చెప్పేసినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. కానీ కృతి శెట్టి స్వయంగా వెల్లడించే వరకు ఈ వార్తను అధికారికంగా ద్రువీకరించలేం. ప్రస్తుతం కృతి శెట్టి నాని సినిమాతో పాటు సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తోంది. మరి.., బాలీవుడ్ ఆఫర్ విషయంలో బేబమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.