విలక్షణ నటుడు విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అపరిచితుడు, శివపుత్రుడు సినిమాలతో అప్పట్లోనే సంచలనం సృష్టించి.. తెలుగులో కూడా మంచి బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పటినుండి విక్రమ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. అయితే.. సినిమా సినిమాకి డిఫరెంట్ వేరియేషన్స్ తో మెప్పిస్తున్న విక్రమ్.. ఇప్పుడు కోబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 31న రిలీజ్ అవుతోంది.
ఇక తమిళ, తెలుగు, కన్నడ భాషలలో రిలీజ్ అవుతున్న కోబ్రా సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి హీరో విక్రమ్ తో పాటు చిత్రబృందం అంతా పాల్గొంది. ఈ క్రమంలో కోబ్రా సినిమాకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పిన హీరో విక్రమ్.. ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభుతో చేసిన సంభాషణ ఈవెంట్ లోనే హైలైట్ గా నిలిచింది. జర్నలిస్ట్ ప్రభు అంటే స్టార్స్ అందరికి సుపరిచితమే.
ఈ నేపథ్యంలో జర్నలిస్టు ప్రభును హీరో విక్రమ్ ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పలకరించి మాట్లాడటం జరిగింది. ఇక విక్రమ్ తో జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. “మీరు నటించిన అపరిచితుడు సినిమాలో దేశం గురించి, దాని విలువల గురించి చూపించారు. అందులో మీరు ఎంతో గొప్పగా నటించారు. ఇప్పుడు కోబ్రాలో దేని గురించి చూపించబోతున్నారు? మ్యాథమెటిక్స్ గురించా లేక ఏవైనా సోషల్ ఇష్యూస్ పైనా.. లేదా కేవలం మీ గెటప్స్ గురించే చూపించనున్నారా?” అని అడిగారు.
జర్నలిస్ట్ ప్రభు అడిగిన ప్రశ్నకు విక్రమ్ స్పందిస్తూ.. ‘ఈ సినిమా కేవలం గెటప్స్ గురించే కాదు. అవన్నీ క్యారెక్టర్ లో డైమన్షన్స్ మాత్రమే. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమాలో మెసేజ్ అని కాకుండా లవ్, ఎమోషన్స్ గురించి ఎక్కువ ఉంటుంది” అని చెప్పారు. అలాగే హీరో విక్రమ్, జర్నలిస్ట్ ప్రభు ఇద్దరూ కూడా లవ్ గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి హీరో విక్రమ్ కోబ్రా సినిమా గురించి, జర్నలిస్ట్ ప్రభుతో సంభాషణ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.