వెంకటేష్ మహా ఇటీవల కేజీఎఫ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెంకటేష్ మహాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలువురు సినీ జర్నలిస్టులు కూడా కేజీఎఫ్ సినిమాని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని కమర్షియల్ సినిమాలని చిన్నచూపు చూడకండి అంటూ పరోక్షంగా వెంకటేష్ మహాపై కౌంటర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా.. కేజీఎఫ్ సినిమాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా విమర్శలకు గురవుతున్నారు. కేజీఎఫ్ ఫ్యాన్స్ ఇప్పటికీ వెంకటేష్ మహాను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను మాత్రం తాను చేసిన వ్యాఖ్యలపై ఏ మాత్రం వెనక్కి తగ్గనని అంటున్నారు. ఈ క్రమంలో హీరో నాని వెంకటేష్ మహాను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం హీరో నాని దసరా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మార్చి 30న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా నాని వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో కమర్షియల్ హంగులతో తెరకెక్కడంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రమంలో కమర్షియాలిటీ గురించి నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చాలా మంది కమర్షియల్ అని, మంచి కథ అని సినిమాని వేరు చేసి మాట్లాడుతున్నారని, కమర్షియల్ సినిమాలను చిన్న చూపు చూస్తున్నారని, అది కరెక్ట్ కాదని అన్నారు. నిజానికి కమర్షియల్ సినిమాల వల్లే భారతీయ చిత్ర పరిశ్రమ ఎదిగిందని నాని అన్నారు. ఇండస్ట్రీలో ఆదాయం తెచ్చిపెట్టే వారు ఉన్నారని, కమర్షియల్ సినిమా అనేది లేకపోతే ఆదాయమే ఉండదని నాని అన్నారు. కమర్షియల్ సినిమాలు ఇండియన్ సినిమాకి వెన్నెముక లాంటిదని అన్నారు. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు జనాలు ఎగబడి రారు. కాబట్టి కమర్షియల్ సినిమాలే సినిమా పరిశ్రమకు బ్యాక్ బోన్ అని అన్నారు.
ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ కి కౌంటర్ అంటూ వైరల్ చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమా ఫంక్తు కమర్షియల్ సినిమా. అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాపై విలువలు లేవు అంటూ వెంకటేష్ మహా కామెంట్స్ చేయడంతో కేజీఎఫ్ మూవీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెంకటేష్ మహాపై మండిపడుతున్నారు. ఇప్పుడు నాని చేసిన కామెంట్స్ కేజీఎఫ్ ఫ్యాన్స్ కి సపోర్ట్ గా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా నాని ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటి? నాని పరోక్షంగా వెంకటేష్ మహాకు కౌంటర్ ఇచ్చారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.