ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే అందరూ కోరుకుంటారు. కొన్నిసార్లు అనుకున్న సినిమాలు ఆడకపోవచ్చు. ఇంకొన్ని ఊహించని రేంజ్ లో ఆడొచ్చు. కానీ.. రెండు ఆడితే ఇంకా బాగుండేది అనే మనస్తత్వం అందరిలో కనిపించట్లేదు. రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బిగ్ సక్సెస్ అయ్యింది బలగం సినిమా. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న హరీష్ శంకర్.. ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో జరుగుతున్న డిబేట్స్ పై స్పందించి.. కొన్ని సూచనలు చేశారు.
ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే అందరూ కోరుకుంటారు. కొన్నిసార్లు అనుకున్న సినిమాలు ఆడకపోవచ్చు. ఇంకొన్ని ఊహించని రేంజ్ లో ఆడొచ్చు. కానీ.. రెండు ఆడితే ఇంకా బాగుండేది అనే మనస్తత్వం అందరిలో కనిపించట్లేదు. రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బిగ్ సక్సెస్ అయ్యింది బలగం సినిమా. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో జరుగుతున్న డిబేట్స్ పై స్పందించి.. కొన్ని సూచనలు చేశారు. ఇండస్ట్రీ అంతా ఓ కుటుంబం లాంటిది.. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఆడాలి.. బలగం, మల్లేశం సినిమాలు కూడా ఆడాలి.. అన్నీ ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుందంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ఇది క్లాస్ సినిమా.. ఇది కమర్షియల్ సినిమా. ఇది మాస్ సినిమా అంటూ కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ, మీడియా అవగాహన కోసం పెట్టుకునే పేర్లు. సినిమాలు చూసే ప్రేక్షకులు ఇవన్నీ చూడరు. వాళ్ళు కేవలం ఇది మంచి సినిమానా? కాదా? అని మాత్రమే చూస్తారు. ఒకప్పుడు ‘శంకరాభరణం’, ‘సీతాకోక చిలుక’ సినిమాలకు బళ్లు కట్టుకుని వెళ్లి చూశారు. వాటిలో ఏ సుమోలూ ఎగరలేదు. రక్తపాతాలు జరగలేదు. మాస్ పీపుల్ కూడా ఆ సినిమాలు చూశారు. అది క్లాస్ సినిమానా? మాస్ సినిమానా అని ఎలా డిసైడ్ చేస్తాం. సాగర సంగమంలో ఒక ఎక్స్ట్రార్డినరీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కమల్ హాసన్ గారు డ్యాన్స్ గురించి శైలజగారికి చెబుతారు. ఆ సీన్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి.
అదేవిధంగా ‘నా పేరు బాషా.. మాణిక్ బాషా’ అన్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడీ బలగం సినిమా చూసి అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, త్రినాథరావు లాంటి కమర్షియల్ డైరెక్టర్స్ ఏడ్చేశారు. ఇండస్ట్రీ ఉమ్మడి కుటుంబం లాంటిది. ఒకడు రూ.300 కోట్ల సినిమా తీసినా, ఇంకొకడు రూ. 3 కోట్ల సినిమా తీసినా అది మన సినిమానే. మనం ఫైట్ చేసేందుకు బయట వంద విషయాలున్నాయి. మనమంతా కుటుంబంగా ఉండి వాటితో పోరాడాలి. మనలో మనం గొడవ పడకూడదు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు అర్థంకాని విషయం ఏంటంటే.. ఒకరిని లేపడానికి ఇంకొకరిని తక్కువ చేయడం ఎందుకు? ఒకడి సినిమా పోతే చప్పట్లు కొట్టడం అనేది మినిమమ్ సెన్స్ లేనివాళ్లు చేసే పని” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హరీష్ శంకర్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి హరీష్ శంకర్ మాటలపై, ఇండస్ట్రీలో జరుగుతున్న డిబేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.