నటీమణులను స్టార్ క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది. అయినప్పటికీ నటీమణులు తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అందం, పిట్ నెస్ పై శ్రద్ధ చూపిస్తున్నారు వారిలో ఒకరు ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యా భార్య నటాసా. ఓ బిడ్డకు జన్మనిచ్చినా కూడా ఆమెలో అందం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింటినీ షేక్ చేస్తున్నాయి.
భారత స్టార్ క్రీడాకారులు, నటీమణులను వివాహం చేసుకోవడం సర్వసాధారణం. మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మీలా ఠాగూర్‍తో మొదలైన ఈ పంథా.. ఇటీవల పెళ్లి చేసుకున్న అతియా శెట్టి, కె. ఎల్ రాహుల్ వరకు కొనసాగింది. అయితే వీరిలో కొన్ని జంటలు విడిపోగా.. కొన్నికాపురాలు హాయిగా సాగిపోతున్నాయి. వారిలో ఒకరు స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా, నటి నటాసా స్టాంకోవిచ్. ఇటీవల ఈ జంట మరోసారి వివాహం చేసుకుని, వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత వీరిద్దరూ మరోసారి పెళ్లి పీటలు ఎక్కారు. ఆ ఫోటోలు సైతం నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు నటాషాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో ఆమె అందాల ప్రదర్శన చేశారు. నటాసా స్టాంకోవిచ్ స్వతహాగా మోడల్, నటి అనే విషయం తెల్సిందే. 2020లో హార్థిక్ పాండ్యాతో వివాహం అయిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చాక మోడలింగ్ విషయంలో కాస్త విరామం ఇచ్చిన ఆమె.. ఇప్పుడు అందాల ఆరబోత ఫోటోలతో దర్శనమిచ్చారు. మొన్న సిల్వర్ డ్రెస్ తో మెరిస్తే.. తాజాగా బంగారు వర్ణంతో కూడిన ఔట్ ఫిట్‌లో , క్రేజీ లుక్స్ లో అదరగొడుతున్నారు. ప్రముఖ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన సూపర్ గోల్డెన్ కాస్ట్యూమ్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
తాజాగా గోల్డెన్ డ్రస్ ధరించి చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అవి నెట్టింట్లో హాట్ వ్యూస్ గా మారిపోయాయి. ఆమె దీనికి క్యాప్షన్ గా గోల్డెన్ గర్ల్ అంటూ రాసుకొచ్చారు. ఓ బిడ్డకు తల్లైనా ఇంత అందం ఈ అమ్మడికే సాధ్యం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తన శ్రీమతి హాట్ ఫోటోలకు హార్థిక్ పాండ్యా ఫైర్, హార్ట్ సింబల్స్ ను రిప్లైగా ఇచ్చారు. సెలబ్రెటీలు కూడా నటాసా బంగారు వర్ణపు ఔట్ ఫిట్ అందాల ఆరబోతకు ఫిదా అయ్యాం అంటూ కామెంట్స్ చేశారు. పెళ్లి అయ్యాక కూడా నటీమణులు కెరీయర్ ను కొనసాగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.