ప్రముఖ నటి హంసానందిని కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాటం చేసి గెలిచారు. కొన్ని నెలల పాటు నరకం అనుభవించారు. ఎన్ని జరిగినా.. ఎంత జరిగినా.. పోరాటం ఆపకుండా విజయం సాధించారు.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు హంసానందిని. నటిగా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్‌గా ఈమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయటంతో పాటు నటిగా కూడా కొన్ని సినిమాలు చేశారు. మిర్చి సినిమాలో ‘మిర్చి.. మిర్చి’ సాంగ్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సమయంలో ఆమె క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. 2021లో ఆమెకు క్యాన్సర్ వ్యాధి నిర్థారణ అయింది. ఆమెకు బ్రీస్ట్ క్యాన్సర్ వచ్చింది. థర్డ్ స్టేజీలో ఉండగా ఆమె చికిత్స తీసుకోవటం మొదలుపెట్టారు. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని ప్రాణాంతక వ్యాధినుంచి బయటపడ్డారు. చికిత్స సందర్భంగా ఆమె తనకు ఎంతగానో ఇష్టమైన కురులను తొలగించుకోవాల్సి వచ్చింది.
కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నంత కాలం గుండుతోనే ఉన్నారు. చికిత్స అయిపోయి, ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతినుంచి యధావిధిగా జుట్టు పెంచటం మొదలుపెట్టారు. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సంవత్సరం క్రితం తాను గుండుతో ఉన్న దృశ్యాలను, ఇప్పుడు జుట్టుతో ఉన్న దృశ్యాలను ఉంచారు. వీడియో కింద ‘‘ ఓ సంవత్సరంలో చాలా జరిగాయి.. నేను ఆరోగ్యంగానే ఉన్నా’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ జుట్టు ఉన్నా జుట్టు లేకపోయినా.. యోధురాలివే.. ఎల్లప్పుడూ రాణివే’’.. ‘‘మీరు ఆ వ్యాధినుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.