సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. పలువరు తమలోని టాలెంట్‌ని సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ ఒకరు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బుల్లితెర మీద సద్దాంతో కలిసి పలు కామెడీ షోలు చేశాడు. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ మా కామెడీ స్టార్స్ ప్రోగ్రాం చేస్తున్నాడు. ఇక రియాజ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే రియాజ్ గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేశాడు. ఇక సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉండే రియాజ్ నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా అభిమానులను పలకరిస్తుంటా డు. ఈ క్రమంలో రియాజ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అందేంటంటే.. అతడు వివాహం చేసుకున్నాడట.
సోషల్ మీడియాలో వైరలవుతున్న దాని ప్రకారం రియాజ్ వివాహం నజీరా అనే అమ్మాయితో ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రియాజ్ పెళ్లికి సంబంధించి ఈ ఏడాది ఫివ్రబరిలోనే ఒక వార్త వచ్చింది. అప్పుడు కూడా రియాజ్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోను బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ రియాజ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Breaking: షారుక్ ఖాన్ కు పోలీసుల నోటీసులు..!
ఈ సందర్భంగా అషు రెడ్డి ఇలా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రియాజ్ అండ్ నజీరా అంటూ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం మరోసారి రియాజ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sonali Bendre: అప్పట్లో కేవలం డబ్బు కోసమే వాటికి ఒప్పుకున్నా! హీరోయిన్ సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్!