సినిమా తారలు ఎక్కడా కనిపించిన వారు వేసుకునే డ్రెస్, షూస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్ గురించి చర్చించుకుంటాం. వాటి ధర తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తాం. తాజాగా పఠాన్ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న షారూఖ్ వాచ్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఈ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని వెతకడం మొదలు పెట్టారు.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. గత నెల 25న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. బ్లాక్ బస్టర్ మొహం చూసి చాలా ఏళ్లైన బాలీవుడ్ కు ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి.. రాబోయే సినిమాలపై ఆశలు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.900 కోట్లను రాబట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమా విజయం పట్ల ఈ సినిమా టీం అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల పఠాన్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించగా.. షారుఖ్, దీపికా పడుకునే పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో షారూఖ్ వేసుకున్న డ్రస్ తో చేతికి పెట్టుకున్న బ్లూ వాచ్ కూడా ఆకర్షణీయంగా కనిపించింది.
కాగా, ఇటీవల తన స్కీన్ కేర్ రోటిన్‌కి సంబంధించి దీపికా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో షారూఖ్ కూడా కనిపించారు. ఆ వీడియోలో ఈ వాచ్ ధరించడంతో అందరీ దృష్టి దానిపై పడింది. వీడియోలో తెల్లని టీ షర్ట్ లో దర్శనమిచ్చారు. ఇప్పుడు ఈ వాచ్ ఎంత అనే దానిపై నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. డైట్ సబ్యా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ వాచ్ ఎంత అంటూ ప్రశ్నలు రాగా, అడెమర్స్ పిగెట్ అనే లగ్జరీ వాచ్ బ్రాండ్ కు చెందినది అని సమాధానం ఇచ్చింది. దానితో పాటు ఓ స్క్రీన్ షాట్‌ను జత చేసింది.
దీని ప్రకారం ఈ వాచ్ ధర రూ. 4.98 కోట్లు. కాగా, షారూఖ్ కు రూ. 200 కోట్లు విలువ చేసే ఇల్లు మన్నత్ తో పాటు బీఎండబ్ల్యూ 7, బీఎండబ్ల్యూ 6 సిరీస్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఢిల్లీలో కూడా ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. షారూఖ్.. పఠాన్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నజవాన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ ఏడాది జూన్ లో విడుదల అవుతుంది. షారూఖ్ నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.