గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి.. అందుకు తగ్గట్టుగానే స్టార్ హీరోల చిత్రాలు బైకాట్ రూపంలో నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలకు ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టు ముడుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై చిక్కుల్లో పడింది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటిస్తోన్న చిత్రం ‘పఠాన్’. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఆ మద్య రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో కనిపించాడు. ఇటీవల ఆ మూవీ చిత్రానికి సంబంధించిన ‘బేషరమ్ రంగ్’అనే రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్ది గంటల్లోనే ఆ సాంగ్ తెగ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ లో దీపికా పదుకొనే బికినీలో రెచ్చిపోయింది. దీనిపై ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగింది.. ఈ సాంగ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
‘బేషరమ్ రంగ్’ సాంగ్ లో దీపికా పదుకొనె ధరించిన బికినీ పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అసభ్యకరంగా డ్యాన్స్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు ఇండోర్ నగరంలో పఠాన్ మూవీ పోస్టర్ కి నిప్పంటించి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖా మంత్రి సరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. ఈ మూవీలో మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉంటే వెంటనే తొలగించాలని అప్పుడే విడుదలకు అనుమతిస్తామని.. లేదంలే ఏం చేయాలనేది ఆలోచిస్తామని ఆయన ఇన్ డైరెక్ట్ గా చిత్ర యూనిట్ కి వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం.. ‘బాయ్ కాట్’ సెగ తగలడం కామన్ అయ్యింది. ఈ క్రమంలో పఠాన్ మూవీకి కూడా బైకాట్ సెగ తగిలింది. ఈ మూవీలో దీపికా పదుకొనె కాషాయం రంగు బికినీ ధరించి షారూఖ్ ఖాన్ తో రొమాన్స్ చేసిన దృష్యాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓ వైపు దక్షిణాది చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ.. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ షేక్ చేస్తుంటే.. బాలీవుడ్ మూవీలకు రిలీజ్ కంటే ముందే బైకాట్ సెగలు తగలడంతో అట్టర్ ఫ్లాప్ అవడమే కాదు.. భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మరి ఈ రగడపై పఠాన్ మూవీ యూనిట్ ఎలా స్పందిస్తూ చూడాలి.