తెరపైనే నటులమని, తెర వెనుక తాము కూడా సామాన్యులమని నటీనటులు భావిస్తుంటారు. సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఇతరులతో కలిసేందుకు ఆసక్తి చూపుతారు. తమ సిబ్బందిలో ఏ కష్టమొచ్చినా ఆపన్న హస్తం అందిస్తుంటారు. అటువంటి వారిలో ఒకరు గోపిచంద్.. ఆయన ఏం చేశారంటే..?
తెలుగు సినిమా హీరోలు మనస్సున్న హీరోలని రుజువు చేసుకుంటున్నారు. సినిమా తెరపైనే కాదూ నిజ జీవితంలో తాము హీరోలమని నిరూపించుకుంటున్నారు. ఎంతో కొంత సామాజిక బాధ్యతల్లోనూ నటులు పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా తమ వద్ద పనిచేసే సిబ్బందికి ఏ కష్టమొచ్చిన మాట సాయంతో పాటు వారికి అండగానూ నిలుస్తున్నారు. ఆర్థిక సాయం చేస్తుంటారు. కుడి చేతో చేసే ఏ సాయమైనా ఎడమ చేతికి తెలియకూడదని భావిస్తుంటారు. కానీ ఈ విషయాలను ఎవ్వరికీ తెలియవు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు మన టాలీవుడ్ యంగ్ టాలెండెట్ గోపిచంద్.
టాలీవుడ్ హీరో గోపిచంద్ ఎంత డౌన్ టు ఎర్త్ అనే విషయం మరోసారి బయటపడింది. గోపిచంద్ దగ్గర వ్యక్తిగత సహాయకునిగా శ్రీను అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇటీవల శ్రీను ఇల్లు కట్టుకుని, బుధవారం గృహ ప్రవేశం నిర్వహించుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గోపిచంద్ హాజరయ్యి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచడంతో పాటు కాసేపు సందడి చేశారు. పూజలో పాల్గొని ఆ కుటుంబ సభ్యులను ఆశ్వీరదించారు. గోపిచంద్ రాకతో శ్రీను కుటుంబం కూడా ఆనందంలో మునిగి తేలింది. వ్యక్తిగత సిబ్బంది పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేనప్పటికీ.. ఆయన వారి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన మనసున్నవ్యక్తిగా మరోసారి నిరూపించుకున్నారు.
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు గోపిచంద్. మిస్టర్ మ్యాచోగా పేరొందిన ఈ హీరో చాలా కామ్ గా కనిపిస్తారు. దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా.. తనను తాను నిరూపించుకున్నారు. ఫస్ట్ సినిమా డిజాస్టర్ అయినా నిరుత్సాహ పడకుండా, సినిమా పరిశ్రమలో కొనసాగాలన్న ఉద్దేశంతో విలన్‌గా కూడా మారారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా మారి.. తనలోని హీరోయిజాన్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. యజ్షం, ఆంధ్రుడు, రణంతో బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టాడు. ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో రామ బాణం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటిస్తున్నారు.