జబర్దస్త్.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఉండరు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ షో అనేక రికార్డులు సృష్టించింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు గా మారి బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ అనేక మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ షోపై, మల్లెమాల సంస్థ పై కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ అందరికి తెలిసిందే. దీనికి తోడు ఒక్కొక్కరు ఈ షోను బయటకు వెళ్లిపోతుండడంతో అసలు ఏం జరుగుతుందని బుల్లితెర అభిమానులకు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈక్రమంలో జబర్దస్త్ షోలోకి గెటప్ శ్రీను రీఎంట్రీ ఇచ్చి.. అందరిని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో శ్రీను కనిపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జబర్దస్ షో విషయంలో కొంచెం వెనక్కి వెళ్తే.. ఈ షో నుంచి రోజుల వ్యవధిలో పలువురు కమెడియన్స్ తప్పుకున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి స్టార్స్ తప్పుకున్నారు. జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న వీరందరూ మూకుమ్మడిగా జబర్దస్త్ ని వదిలేయడం ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేసింది. తాజాగా అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా అందరూ జబర్దస్త్ ను వీడుతున్నారు. ఇంకా మరికొందరు కూడా వెళ్లిపోతారు.. ఇక ఈ షో పని అయిపోందంటూ.. వార్తలు వస్తున్న సమయంలో బుల్లితెర ఫ్యాన్స్‌కు కిక్కెచ్చే న్యూస్ వచ్చింది.
జులై 29న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఇందులో గెటప్ శ్రీను షోలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. రామ్ ప్రసాద్ స్కిట్ జరుగుతుండగా గెటప్ శ్రీను సడన్ ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని వేదికపై చూసిన కంటెస్టెంట్స్, జడ్జ్ లు ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోకుండా స్నేహితుడు రావడంతో ఆటో రామ్ ప్రసాద్ సైతం షాక్ గురై.. తెగ సంబరపడిపోయాడు. వెంటనే తాను చేస్తున్న స్కిట్‌ను ఆపేశాడు. శ్రీనును హాగ్ చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించి ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో గెటప్ శ్రీను జబర్ధస్త్ కి రీ ఎంట్రి ఇచ్చారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెక్ట్స్ సుధీర్ కూడా వస్తాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. గెటప్ శ్రీను జబర్దస్త్ షోలో రీఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆమిర్ ఖాన్ మూవీ చూస్తూ నిద్రపోయిన కరీనా కపూర్! బోరింగ్ గా ఉందంటూ..
ఇదీ చదవండి: నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అంటూ అనసూయను నిలదీసిన చలాకీ చంటి!