చాలాకాలం తరువాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "లాల్ సింగ్ చద్ధా". ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ షోకి ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, నటి కరీనా హాజరయ్యారు. అయితే మూవీ చూస్తున్న క్రమంలో కరీనా నిద్రపోయింది. దీనికి సంబంధించిన పిక్స్ ట్వీట్లో వైరల్ అవుతున్నాయి. ప్రీమియర్ షోకి హాజరైనా ఆమిర్ ఖాన్ మధ్యలో కూర్చొని ఉండగా.. ఆయనకి కుడివైపున కిరణ్ రావు కూర్చొని ఉంది. వారిద్దరూ ఎంతో ఆసక్తిగా మూవీని చూస్తుండగా.. ఆమిర్ కి మరోవైపు కూర్చున కరీనా మాత్రం నిద్రపోతోంది. కరీన కపూర్..తలను ఓ చెతిపై వాల్చి, ఫుల్ నిద్రలోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. సహార్స్ అనే నెటిజన్ వీరికి సంబంధించిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు వీటిపై స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "లాల్ సింగ్ చద్ధా" చాలా బోరింగ్‌గా ఉన్నట్లు ఉంది అందుకే కరీనా నిద్రపోతోంది" అంటూ ట్రోల్ చేస్తున్నారు. "తన సినిమా చూసుకోని ఆమిర్ బాగా ఎమోషనల్ అవుతున్నాడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. aamir khan crying watching laal singh chaddha as if he didn’t watch the original forrest gump pic.twitter.com/8iqt2BlLbR — Saharsh (@whysaharsh) July 21, 2022 ఇదీ చదవండి: Sreemukhi: పదహారణాల తెలుగమ్మాయిల శ్రీముఖి.. ఫోటోలు వైరల్! ఇదీ చదవండి: నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అంటూ అనసూయను నిలదీసిన చలాకీ చంటి! ఇదీ చదవండి: Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీను వైట్ల