జబర్దస్త్.. ఈ కామెడీ షో ద్వారా టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్లు అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. అయితే గతకొంతకాలంగా ఈ షో నుంచి కొందరు కమెడియన్లు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అనసూయ కూడా ఈ షో మానేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన ప్రోమోతో అనసూయ వెళ్లిపోతున్న విషయాన్ని జబర్దస్త్ నిర్వాహకులు కన్ఫమ్ చేశారు. చలాకీ చంటి స్కిట్ లో అనసూయకు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత తాగుబోతు రమేశ్ అయితే అనసూయ మీద ఏకంగా స్కిట్ చేశాడు. అనసూయ గెటప్ వేసిన తాగుబోతు రమేశ్ ఎమోషనల్ డైలాగులతో కంటెస్టెంట్లను, జడ్జి ఇంద్రజను కన్నీళ్లు పెట్టించాడు. చంటి పిల్లలు ఉన్న సమయంలో కూడా, తాను జబర్దస్త్ కోసం ఎలా కష్టపడిందో చెప్పుకొచ్చారు. పిల్లలను తల్లి వద్ద వదిలి కూడా జబర్దస్త్ షోకు వచ్చావ్.. నువ్ ఈ షో నుంచి వెళ్లిపోతోన్నావా? అన్నట్టుగా చెప్పుకొచ్చారు. లాస్ట్ లో ఇంద్రజ బాగా ఎమోషనల్ అయ్యారు. కచ్చితంగా ఈ షో మిమ్మల్ని మిస్ అవుతుందంటూ అనసూయను హత్తుకుని ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఎంతో మందికి ఈ షోలైఫ్ ఇచ్చింది, ఇస్తూనే ఉంటుంది. ఈ షోకి ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారూ జబర్దస్త్ మాత్రం పర్మినెంట్” అంటూ కంటెస్టెంట్లు ముక్త కంఠంతో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి జబర్దస్త్ ని విడిచివెళ్తున్న విషయాన్ని అనసూయ చాలా రోజుల క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. తన జీవితంలోనే ఎంతో పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు.. గతంలో లాగానే తనకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానంటూ అనసూయ పోస్ట్ చేసింది. ఇప్పుడు జబర్దస్త్ వాళ్లు కూడా ఆ విషయాన్ని కన్ఫమ్ చేశారు. జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Surya: ఓ సినిమా కోసం సూర్య ఇంత కష్టపడతాడా? హేట్సాఫ్ సూర్య! ఇది కూడా చదవండి: Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీను వైట్ల