సినీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. 94 సంవత్సరాలుగా ఈ ఆస్కార్ వేడుకలు నిర్వహిస్తూ.. అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఆస్కార్ అంటే.. వరల్డ్ వైడ్ సినీ రంగంలో ఉన్నవారందరికీ.. బిగ్ డ్రీమ్ లాంటిది. దానికోసం సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్టుల వారు అహర్నిశలు కష్టపడుతూ.. కలలు కంటుంటారు. ఈసారి ఆస్కార్ వేడుకలలో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్' వారు ఓ కీలక మార్పు చేశారు.
సినీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. 94 సంవత్సరాలుగా ఈ ఆస్కార్ వేడుకలు నిర్వహిస్తూ.. అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఆస్కార్ అంటే.. వరల్డ్ వైడ్ సినీ రంగంలో ఉన్నవారందరికీ.. బిగ్ డ్రీమ్ లాంటిది. దానికోసం సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్టుల వారు అహర్నిశలు కష్టపడుతూ.. కలలు కంటుంటారు. అయితే.. ఆస్కార్ అందుకోవడం అనేది అంత ఈజీ కాదు. దాన్ని అందుకోవడం గగనంగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఎంతో ఆర్భాటంగా 95వ ఆస్కార్ పురస్కార వేడుకలు జరగనున్నాయి. మార్చి 12న(ఇండియాలో 13న) జరగబోయే ఈ వేడుకల కోసం ఆల్రెడీ లాస్ ఏంజెల్స్ లో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా అన్ని దేశాల ఎన్నో సినిమాలు ఆస్కార్ బరిలో పోటీ పడ్డాయి. కానీ.. దశలవారీగా జరిగిన ఓటింగ్స్ లో అన్నీ పోను.. ది బెస్ట్ అనిపించుకున్న సినిమాలు ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్నాయి. ఇక ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్స్ లో జరగనున్నాయి. అయితే.. చాలా ఏళ్ళ తర్వాత ఇండియాకి కూడా ఆస్కార్ ఎంతో స్పెషల్ గా మారింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆస్కార్ అత్యంత ప్రధానం అయ్యింది. ఎందుకంటే.. ఆస్కార్ బరిలో తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ సినిమాని రిప్రెసెంట్ చేయనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనడం ఈ ఉత్సాహానికి కారణం.
ఇదిలా ఉండగా.. 62 ఏళ్లలో తొలిసారిగా ఆస్కార్ వేడుకలలో కొత్త మార్పు కనిపించనుందట. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్నేషనల్ అవార్డుల వేడుకలు ఏవైనా రెడ్ కార్పెట్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెడ్ కార్పెట్ పైనే సినీ తారలు తమ గ్లామర్ ని రిప్రెజెంట్ చేస్తుంటారు. 62 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఆస్కార్ అవార్డులలో రెడ్ కార్పెట్ పరుచుకోనుంది. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టాలనేది స్టార్స్ కల. అయితే.. ఈసారి రెడ్ కార్పెట్ రంగు మారనుందట. 1961 నుండి ఆస్కార్ లో రెడ్ కార్పెట్ పరుస్తారు. ఇప్పుడా సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ.. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్’ ఈసారి ఎరుపు రంగుకు బదులు ‘షాంపైన్’ రంగును ఎంపిక చేసింది. ఈ 95వ ఆస్కార్ వేడుకలలో నటి దీపికా పదుకొనే హాజరుకానుంది. మరి ఆస్కార్ లో ఈ కొత్త మార్పుతో పాటు నాటు నాటు గెలుపుతో ఇండియన్స్ కి ఆస్కార్ మరింత స్పెషల్ అవుతుందేమో చూడాలి! మరి నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో.. గెలుపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#Oscars Christina Aguilera in the red carpet looking absolutly flawless pic.twitter.com/OfmoxVhYTC
— #AGUILERA (@XAguileraArg) March 12, 2023