సినీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. 94 సంవత్సరాలుగా ఈ ఆస్కార్ వేడుకలు నిర్వహిస్తూ.. అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఆస్కార్ అంటే.. వరల్డ్ వైడ్ సినీ రంగంలో ఉన్నవారందరికీ.. బిగ్ డ్రీమ్ లాంటిది. దానికోసం సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్టుల వారు అహర్నిశలు కష్టపడుతూ.. కలలు కంటుంటారు. ఈసారి ఆస్కార్ వేడుకలలో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్' వారు ఓ కీలక మార్పు చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మక ఇచ్చే అస్కార్ అవార్డు ఫంక్షన్ ఈ నెల 13 న లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరగబోతుంది. ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలని అంటారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డుల రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతుంది.