ఆదిపురుష్ విషయంలో ఓం రౌత్ సీరియస్ గా లేరా? ప్రభాస్ తో అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న అప్ డేట్ ఇవ్వడానికి కూడా ఎందుకు వెనుకబడుతున్నారు? అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా విషయంలో అభిమానులు నిరాశలో ఉన్నారు.
సాధారణంగా ఒక టాప్ హీరో సినిమా టీజర్ రిలీజైతే సినిమాకి ఎక్కడ లేని హైప్ వస్తుంది. సినిమా ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే..ఆ సినిమా రిలీజయ్యేలోపు ఇచ్చే చిన్న అప్ డేట్ అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు సినిమా గురించి అప్డేట్ ఇస్తూ .. ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలవుతాయి. కానీ ఒక పాన్ ఇండియా సినిమా మాత్రం చిన్న అప్డేట్ ఇచ్చే విషయంలో బాగా వెనుకబడుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి దాదాపు ఏడాదికి పైనే అవుతున్న ఈ సినిమా విషయంలో ఒక చిన్న అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ బాగా నిరాశకు లోనవుతున్నారు.
బాహుబలి తర్వాత తెలుగులో తొలి పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ విషయంలో ఫ్యాన్స్ సైతం చాలా గర్వంగా ఫీలవుతారు. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ లాంటి సినిమాలను పాన్ ఇండియాగా రిలీజ్ చేసి తన మార్కెట్ ని మరింతగా పెంచుకున్నాడు. సాహో తెలుగులో ఆడకపోయినా, నార్త్ లో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అయితే ఇంత ఫాస్ట్ గా దూసుకెళ్లిన ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి చిన్న అప్ డేట్ ఇచ్చే విషయంలో బాగా వెనుకపడుతున్నాడు. వరుసపెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నా ఏ సినిమా విషయంలో టీజర్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీజర్ విమర్శలు మూటకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో ఓం రౌత్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ వర్క్ అసలు బాగా లేకపోవడంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ ని ఎవరూ కూడా నమ్మడం లేదు. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ డేట్ 2023 జూన్ 16 అని ఇప్పటికే ప్రకటించేశారు. ఇంకా కేవలం రెండు నెలలే ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికి ఆదిపురుష్ రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విడుదల తేదీ పక్కన పెడితే ఈ సినిమాకి బజ్ పెంచడంలో ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ విఫలమవుతున్నారనే చెప్పాలి.
ఇటీవలే ఉగాది పండుగ సందర్భంగా ఏమైనా టీజర్ రిలీజ్ చేస్తారని ఆశించిన అభిమానులకి నిరాశ తప్పలేదు. కారణం ఏదైనా ఇప్పుడు అభిమానులు మాత్రం ఓం రౌత్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో బాగా అభిమానుల అసంతృప్తికి గురైన ఓం రౌత్ ఫ్యాన్స్ ని ఎలా కూల్ చేయడమనేది ఇప్పుడు కత్తి మీద సాములాంటిదే. మరి అభిమానులను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఏమైనా కొత్త అప్డేట్ తో వస్తాడా? లేదా ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తాడా చూడాలి. పాన్ ఇండియా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్. మరి అభిమానులని ఓం రౌత్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.