RRR మూవీ బెనిఫిట్ షోలో విషాదం నెలకొంది. సినిమా చూస్తుండగా గుండెపోటు రావడంతో ఓ అభిమాని మృతి చెందాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన RRR మూవీని చూసేందుకు ఓబులేసు అనే అభిమాని అనంతపురంలోని ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో బెనిఫిట్ షోలో సినిమా చూసేందుకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా హఠాత్తుగా అతనికి గుండె పోటు రావడంతో అక్కడికక్కడే నేలకొరిగాడు.
ఇది కూడా చదవండి: RRR ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందా..?
ఇక వెంటనే స్పందించిన థియేటర్ సిబ్బంది చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు. ఇక మార్గమధ్యలోనే అతను మృతి చెందినట్లు కిమ్స్ ఆస్పత్రి వైద్యుల నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.