షో రేటింగ్స్ కోసం మల్లెమాల టీం రీల్ కపుల్స్‌ని తయారు చేసే సంగతి తెలిసిందే. అలా మల్లెమాల క్రియేట్ చేసిన జంటల్లో.. రష్మి-సుధీర్ జోడీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిజంగా వీరిద్దరూ లవర్స్ అనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. ఆ తర్వాత వర్ష-ఇమ్మాన్యుయేల్ జోడీని తీసుకువచ్చారు. కొన్ని రోజులు వీరి మధ్య లవ్ ట్రాక్ నడిపించారు. ఈ జోడి కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మరో జోడిని తెర మీదకు తీసుకువచ్చారు. వారే రాకేష్-బిగ్ బాస్ ఫేమ్ సుజాత. ప్రస్తుతం సందర్భం చిక్కిన ప్రతి సారి వీరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తోంది మల్లెమాల టీం. తాజాగా ఏప్రిల్ 1న ప్రసారం కాబోయే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో మరోసారి వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి: ప్రేమ విషయాన్ని బయటపెట్టిన జబర్దస్త్ జంట.. త్వరలోనే పెళ్లి?
స్కిట్‌లో భాగంగా సుజాత రాకేష్ అంటే తనకు ఎంత ప్రేమ వెల్లడించింది. తనకు రాకేష్ ఆస్తిపాస్తులతో సంబంధం లేదని.. జీవితాంతం తనతో కలిసి ఉంటే చాలని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. స్కిట్ పూర్తయిన తర్వాత రోజా సుజాతను ఉద్దేశించి.. ‘‘నిన్ను ఏడిపించడానికి రాకేష్ వేరే అమ్మాయితో తిరిగితే.. నువ్వు ఎలా ఫీలవుతావు’’ అని ప్రశ్నించింది. అందుకు సుజాత.. ‘‘రాకేష్ ఎవరితో తిరిగినా నేను బాధపడను.. కానీ తను రాంగ్ పర్సన్ అయ్యుండకూడదు. వేరేవాళ్లతో ఉంటే తను సంతోషంగా ఉంటానంటే.. ఇప్పుడే రాకేష్‌ని వదిలేయడానికి రెడీ’’ అంటూ సుజాత ఎమోషనల్ అయ్యింది.
ఇది కూడా చదవండి: రాకింగ్ రాకేష్ టీమ్ లో నవ్వులు పూయిస్తున్న ఈ నటి ఎవరు?
ఆ మాటలకు రాకేష్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. వీరిద్దరిని ఇలా చూసిన జనాలు.. నిజంగానే రాకేష్, సుజాతలు ప్రేమించుకుంటున్నారు.. స్టేజీ మీదనే సుజాత.. రాకేష్ అంటే తనకు ఎంత ప్రేమో చాటుకుంది అని కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆత్మహత్యా ప్రయత్నం వెనుకున్న నిజాలు బయటపెట్టిన బజర్దస్త్ ‘రాకింగ్ రాకేష్’!