జబర్దస్త్.. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై బాహుబలిలా దూసుకుపోతున్న ఎంటర్టైన్మెంట్ షో. అయితే.., జబర్దస్త్ మాత్రమే కాకుండా, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా కూడా తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ పంచేలా ఈ షో సక్సెస్ అయ్యింది. కానీ.., జబర్దస్త్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.., అన్నే వివాదాలకు కూడా కేంద్రం అయ్యింది. ఇలాంటి వివాదాలు అప్పుడప్పుడు బయట నుండి వస్తుంటే.., మరికొన్ని సార్లు షో ప్రమోషన్ కోసం నిర్వాహకులు సృష్టించుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటనకి రాకింగ్ రాకేశ్ కారణం అయ్యాడు.
జబర్దస్త్ లో లేడీ క్యారెక్టర్స్ కూడా మగవాళ్లే వేస్తూ ఉంటారు. మొదట్లో ఈ షో క్లిక్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. అయితే.., ఈ మధ్య కాలంలో మాత్రం జబర్దస్త్ ట్రెండ్ మారింది. ఆది, సుధీర్, అభి వంటి టీమ్ లీడర్స్.. తమ స్కిట్ లో లేడీ క్యారెక్టర్స్ కోసం నిజంగానే ఫీమేల్ స్టార్స్ ని ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ సూపర్ సక్సెస్ అయ్యింది కూడా. ఇక ఇలా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చే వాళ్ళు మాత్రమే కాకుండా.., జబర్దస్త్ లోనే పాతుకు పోయిన ఫీమేల్ కమెడియన్స్ కూడా ఉన్నారు. వీరిలో ఇప్పుడు ట్రెండ్ లో ఉంది మాత్రం వర్ష, రోహిణి.
వర్ష ఎలాగో ఇమ్మూతో లవ్ ట్రాక్ సెట్ చేసుకుని సక్సెస్ అయిపోయింది. ఇక మిగిలింది రోహిణి మాత్రమే. రాకింగ్ రాకేశ్ టీమ్ లో చేసే రోహిణికి కామెడీ విషయంలో తిరుగులేదు. ఈ మధ్య కాలంలో రాకేశ్ టీమ్ లో ఆమెదే ఫుల్ డామినేషన్. అయితే.., లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో లో మాత్రం రాకింగ్ రాకేశ్ రెచ్చిపోయాడు. లైవ్ లోనే రోహిణీకి ముద్దు పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
స్కిట్ లో భాగంగా.. భార్య భర్తలకు మాత్రమే ఉద్యోగం ఇస్తాము అంటాడు యజమాని. దీంతో రాకింగ్ రాకేశ్, వర్షిణి భార్య భర్తలుగా నాటకానికి తెర లేపుతారు. ఈ ప్రాసెస్ లో తమ బాస్ ని నమ్మించడానికి రాకేశ్.. రోహిణిని దగ్గరికి తీసుకుని.. ఆమె బుగ్గ పై తన బుగ్గ ఉంచి ముద్దు పెట్టేస్తాడు. అవ్వడానికి ఇది స్కిట్ లో భాగమే అయినా.., ఈ సీన్ చూసిన వారంతా షాక్ కి గురి అయ్యారు. రాకేశ్ చేసిన పనికి రోహిణి కూడా ఒక్క క్షణం షాక్ అయినా.., వెంటనే స్కిట్ మూడ్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. జబర్దస్త్ లో తరుచుగా రిపీట్ అవుతున్న ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.