జబర్దస్త్!!. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిని కాసేపు ఆగి తనివితీరా నవ్వుకునేలా చేస్తుంది ఈ కార్యక్రమం. ఎంత ఒత్తిడిలో ఉన్న కాసేపు ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ చూశారు అంటే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా ప్రస్తుతం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతూ బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ప్రస్తుతం నవ్వులకు చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ కార్యక్రమం. ఎన్నో ఏళ్ల నుంచి తిరుగులేని షో గా కొనసాగుతోంది.బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలుగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే వచ్చే శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ 350 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కి సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది.
స్పెషల్ ఎపిసోడ్స్ లో ఎప్పుడూ కుటుంబసభ్యులని ఆహ్వానించడం జబర్ధస్త్ సంప్రదాయం అవుతోంది. ఈ సారి కూడా కంటెస్టెంట్ లు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో నవ్వులు పంచారు.ఐతే ఇప్పుడీ ప్రోమోలో ఈ కమెడియన్స్ తమ జీవనపోరాటంలో మొదట ఎదుర్కొన్న కష్టాల్ని చూపించి ప్రేక్షకులనూ సాటి కమెడియన్స్ నీ కంటతడి పెట్టించారు. మరీ ముఖ్యంగా ‘సాయి’ లేడి గెటప్పుల్లో కామెడీని పండించడం ఇప్పటిదాకా మనకి తెలుసు. ఇప్పుడీ స్పెషల్ ఎపిసోడ్ లో ఈ షో కి రాకముందు తానూ, తన కుటుంబ సభ్యుల కష్టాలను వేదనని చెప్పడం ప్రతీ ప్రేక్షకుడికీ గుండె తడి చేస్తుంది.
బుల్లెట్ భాస్కర్- వర్ష జోడీ సందడి చేసింది. రాము, కుటుంబ సభ్యులు హరికృష్ణ, సతీమణి., హరి, సోదరి సాయి, వాళ్ల నాన్న తళుక్కున మెరిశారు. తన తల్లి ఎంతో కష్టపడి తన తండ్రిని బతికించిందని చెప్పి సాయి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘బజర్దస్త్ ఆర్టిస్టుల లైఫ్ జర్నీ స్కిట్’ పేరుతో నరేశ్ తాను ఎదుర్కొన్న అవమానాల్ని చూపించాడు. చివర్లో కమెడియన్ నరేశ్ వేసిన ప్రశ్నలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేయడం ఖాయం.
నవ్వుల పండించే సీన్స్ తో పాటు కంటతడి పెట్టించే సన్నివేశాలు మరిన్ని ఈ ప్రోమోలో చూడండి: