బిగ్ బాస్ 6 సీజన్ లో తొలివారం ఎలిమినేషన్ ఏం లేదు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా ఈ వారానికి సేఫ్ అనుకున్నారు. కానీ రెండో వారం ఎంటరైపోయింది. నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది. దీంతో ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ కుండ బద్ధలు కొట్టేశారు. ఈ క్రమంలోనే వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. పార్టిసిపెంట్స్ అందరి ముఖాల్లోనూ సీరియస్ నెస్ తప్పించి మరో ఎమోషన్ కనిపించలేదు. అలా రూపొందించిన ప్రోమో హౌసులో ఫుల్ హీట్ పెంచినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6 సీజన్ సోమవారానికి సంబంధించిన రెండో ప్రోమో వచ్చేసింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా కొత్తగా ట్రై చేశారు. నామినేట్ చేయలనుకున్న వారి ఫొటోతో ఉన్న కుండని బావిలో పడేయాలి. మొదటివారం అంతా నామినేషన్లలో కూల్‌గా రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వాదనలు, విమర్శలు, పెదవి విరుపులు, అరుపులు చాలానే ఉన్నాయి. నామినేషన్ లో భాగంగా గీతూ-రేవంత్ మధ్య అరుపులు, కేకలతో బిగ్ బాస్ హీటెక్కిపోయింది. నువ్వు ఎలా మాట్లాడాలో నేనే చెప్పేది ఏందని గీతూ సీరియస్ గా మాట్లాడింది. చంటి కూడా గీతూ నామినేట్ చేస్తూ ఫెర్ఫెక్ట్ రీజన్స్ చెప్పేశాడు.
ఇక షానీని శ్రీసత్య నామినేట్ చేయగా.. తనకి కోపం వచ్చేలా చేయమని వేడుకున్నాడు. ఇలా అన్న సమయంలో మిగతా కంటెస్టెంట్స్ అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఇక ఇనయా.. ఆదిరెడ్డిని నామినేట్ చేయగా, రిటర్న్ మాట్లాడిన ఆదిరెడ్డి.. హౌసులో ప్రతివారం తనని నామినేట్ చేసినా అస్సలు కేర్ చేయనని అన్నాడు. ఇలా ఫుల్ ఆన్ హాట్ హాట్ గా ప్రోమో సాగింది. ఆదిరెడ్డి నామినేట్ చేసుకో అనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ ‘నో ఎలిమినేషన్’ వీక్‌పై ప్రేక్షకులు ఆగ్రహం.. ‘మేం ఓ మాదిరిగా కూడా కనపడటం లేదా?’