జబర్దస్త్.. కామెడీ షోలలో బుల్లితెరపై ఓ ట్రేడ్ మార్క్ ను క్రీయేట్ చేసిన ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వారు ఈ షో పై సంచలన కామెంట్స్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. గతంలో కిర్రాక్ ఆర్పీ, అప్పారావు లాంటి మరికొందరు జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వారే. తాజాగా మరో కమెడీయన్ అదుర్స్ ఆనంద్ సైతం జబర్దస్త్ పై సంచలన కామెంట్స్ చేశారు. నన్ను అన్యాయంగా షో నుంచి తీసేశారని ఆరోపించాడు. పిల్లలున్నారని చేతులెత్తి మెుక్కినా వినిపించుకోకుండా తొలగించారని భావోద్వేగానికి గురైయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ షో. రైల్లో వెళ్తున్నా.. బస్ లో ఉన్నా.. మూడీగా ఉన్నా అక్కడ ఒక్కటే పేరు వినిపిస్తుంది అదే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అని. అంతలా ఈ షో జనాల్లోకి వెళ్లిపోయింది. అయితే రాను రాను ఈ షో నుంచి ఒక్కో కమెడీయన్ వెళ్లిపోతున్నారు. కొందరు మళ్లీ తిరిగి వస్తున్నారనుకోండి అది వేరే విషయం. అయితే వెళ్లిపోయిన వారు పలు ఇంటర్వ్యూల్లో జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాలను, అవమానాలను గూర్చి ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర టీమ్ లో మెయిన్ కంటెస్టెంట్ గా ఉన్న అదుర్స్ ఆనంద్ గా మనకి సుపరిచితమే. చంద్ర తర్వాత సరదా సత్తి పండు-అదుర్స్ ఆనంద్ అనే కొత్త టీమ్ ను జబర్దస్త్ లోకి తెచ్చిన విషయం విదితమే.
ఇక తనను టీమ్ లీడర్ గా తొలగించడంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు అదుర్స్ ఆనంద్. అతడు మాట్లాడుతూ..”నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక కొన్ని సీరియల్లతో పాటుగా ఓ యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాను. అదీ కాక ఒక్క అడుగు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వేశాను. ప్రస్తుతానికైతే జీవితం సజావుగానే సాగుతోందని” ఆనంద్ తెలిపాడు. ఇక జబర్దస్త్ నుంచి తొలగించడం గురించి స్పందిస్తూ..”జబర్దస్త్ లో చమ్మక్ చంద్రన్న దగ్గర నేర్చుకున్న నటనను.. ఆయన ప్యాట్రన్ ను నేను టీమ్ లీడర్ అయ్యాక కూడా కొనసాగించాను. నా స్కిట్స్ కు లక్షల్లో సైతం వ్యూస్ వచ్చేవి, మీరు ఇప్పుడు చూసినా కనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు జబర్దస్త్ గంటన్న ఉండేది. తర్వాత దాన్ని గంటకు కుదించారు. ఈ క్రమంలోనే 6 టీమ్ లను 5 టీమ్ లుగా చేశారు. ఆరో టీమ్ గా ఉన్న నన్ను సత్తి పండు గారిని వేరే టీమ్ లో కలుపుతాం అన్నారు. కానీ ఏ టీమ్ లీడర్ మమ్మల్ని కలుపుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో మమ్మల్ని తీసేయడానికి సిద్దపడ్డారని” ఆనంద్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే నాకు పిల్లలున్నారు నన్ను తీసేయకండి అని చేతులెత్తి మెుక్కినా యాజమాన్యం వినిపించుకోలేదని ఆనంద్ తన బాధను వ్యక్తం చేశాడు. మీరు ఒక్కసారిగా ఇలా తీసేస్తే మేం ఎలా బతకాలి? పిల్లలకు, కుటుంబానికి ఎలా అన్నం పెట్టాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక జబర్దస్త్ మానేసిన తర్వాత తన భార్య ప్రోత్సాహాంతోనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించానని తెలిపాడు. బ్యాడ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దని తన భార్య చెప్పడంతోనే ఛానల్ ను స్టార్ట్ చేసి.. ప్రస్తుతానికి విజయవంతంగా నడుపుతున్నానని ఆనంద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జబర్దస్త్ పై ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.